ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు… వెంటనే ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 7 గంటల సేపు సోరెన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చంపయ్ సోరెన్ సీఎం బాధ్యతలను స్వీకరించనున్నారు.

