ఏలేశ్వరం:-వైస్సార్సీపీ పాలనలో వెనుక బడిన తరగతులకు (బీసీ ) జరుగు తున్న అన్యాయం ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశ్యం తో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ వరుపుల సత్య ప్రభ రాజా ఆధ్వర్యంలో ఏలేశ్వరం లో జయహో బీసీ సమావేశం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎన్.కన్వె న్షన్ లో జరిగిన జయహో బీసీ సమావేశం కి జిల్లా కు చెందిన పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు.వేదిక పై ఉన్న నాయకులు తో కలిసి జయహో బీసీ కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం సత్య ప్రభ నిర్వహించారు. అనంతరం జిల్లా కి చెందిన బీసీ నాయకులు కొందరు మాట్లాడుతూ బీసీ లకు వైస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పై ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ సత్య ప్రభ రాజా మాట్లాడుతూ బీసీ లు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీ లు అన్నారు.బీసీ లకు చెందిన ఆదరణ వంటి 30 పథకాలు వైస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు.బీసీ ల ఓట్ల తో అధికారం లోకి వచ్చిన వైస్సార్సీపీ వారిపైనే దాడులు చేసింది అని ఎద్దేవా చేశారు.బీసీ లపై కేసులు పెట్టి హింసించింది అని ఆరోపించారు.బీసీ లు అంతా ఐక్యం గా వైస్సార్సీపీ ని ఓడించాలి అని ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కాకినాడ రాంబాబు,రాష్ట్ర పెఱిక సాధికార సంఘం అధ్యక్షులు వనపర్తి బద్రి , కాకినాడ సిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, జిల్లా పెఱిక సంఘం అధ్యక్షులు కోమిరిశెట్టి నరసింగ రావు,మూది నారాయణ స్వామి, దనేకుల వీర భద్రం, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు రీసు సత్తిబాబు, దనేకుల వీరభద్రరావు, వనం మంగ, మూది నారాయణ స్వామి, ఓలుపల్లి శ్రీకాంత్, నీలి సత్యనారాయణ, బాజంకి కన్నారావు, బూర్ల బాసు, చల్లా రాజు, ఈపు రాజుబాబు, నక్కా కృష్ణ, వైభోగుల సుబ్బారావు, బెల్లాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

