కామవరపుకోట
అలుపెరుగని యోధుడని విద్యార్థుల కోసం కష్టంచే వ్యక్తిని అటువంటి వ్యక్తిని సత్కరించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాయికంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బొడ్డు శ్రీరాములు అన్నారు. కామవరపుకోట మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావికంపాడు భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఏలూరు జిల్లా రిపబ్లిక్ పేరేడ్ నందు మార్చ్ పాస్ట్ చేసి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖాధికారి వారిచే ప్రశంసాపత్రములు పొందినందున పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బొడ్డు రాములు,విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు తెలిపియున్నారు. ఈ సందర్బంగా రాములు మాట్లాడుతూ స్కౌట్ లో చేరిన విద్యార్థికి మంచి క్రమశిక్షణ, సమయపాలన, సేవభావం, దేశభక్తి అలవడుతుందని తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ స్కౌట్ మాస్టర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు అలుపెరగని యోధునిగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి కృషి అమోఘం, విద్యార్థులు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు. బిరుదు గడ్డ నాగేశ్వరావు మాస్టారు జిల్లా ట్రైనింగ్ ఏ కాకుండా రాష్ట్రంలో కూడా తమ సేవలు ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రక్షించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పిల్లదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

