Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి లక్ష్యం

ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి లక్ష్యం

33 లక్షలతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి కార్యక్రమం

జీలుగుమిల్లి
ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి ఇంటికి మంచినీటి కూడా అందించడమే లక్ష్మణ్ అందుకని జగన్ సంక్షేమ కార్యక్రమాలతో పాటు జలమిషన్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు దర్భ గూడెం సొసైటీ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు అన్నారు.
పల్లెలో నూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి రోజు నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జీలుగుమిల్లి మండలం చీమలవారి గూడెంలో జల జీవన్ మిషన్ పథకం కింద 33 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సొసైటీ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు మరియు సర్పంచ్ సున్నం ఉషారాణి బుధవారం శంకుస్థాపన చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ కొద్దిరోజుల్లో గా ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సున్నం సురేష్ , సచివాలయం కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది వాలంటీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article