పౌరుమామిళ్ల:
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పదవతరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం కావాలని రచయిత ఎస్పీ గఫార్ ,రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఎస్ దాదా పీర్ లు పిలుపునిచ్చారు. మంగళవారం పోరుమామిళ్లలోని ఓఎల్ఎఫ్ బాలికలఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఆరోగ్య రాణి అధ్యక్షతన పదవతరగతి పబ్లిక్ పరీక్షల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. చక్కని చేతిరాతతో పరీక్షలు రాస్తే మంచి మార్కులు పొందవచ్చునన్నారు. విద్యార్థులు బృంద చర్చలలో పాల్గొని పాఠ్యాంశాలపై చర్చించుకుంటే విషయం చాలా కాలం జ్ఞాపకం ఉంటుందన్నారు . అనవసర భయాందోళనలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదవాలన్నారు .రాత్రి పది గంటలకు నిద్రపోయి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి చదివితే ప్రయోజనం ఉంటుందన్నారు .పరీక్షలు పూర్తయ్యే వరకు సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలన్నారు .పరీక్షలలో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. హెచ్ ఎం ఆరోగ్యరాణి మాట్లాడుతూ ఏకాగ్రతతో చదివి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు సిస్టర్ విజయరాణి ,జాని, ఇందిర, మల్లిక ,సరళ ,కావేరి తదితరులు పాల్గొన్నారు.

