Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలువార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు

వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు

-కౌన్సిల్ లో అధికార పార్టీ కౌన్సిలర్లు ఆందోళన…

  • అవినీతిని ప్రశ్నిస్తారనే భయంతోనే సమావేశాలు వాయిదా -టిడిపి కౌన్సిలర్లు

హిందూపురం టౌన్
పురపాలక సంఘం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ వార్డుల్లో ఈ మాత్రం అభివృద్ధి చేపట్ట లేదని…వార్డు వర్యటనకు వెళితే ప్రజలు నిలదీస్తున్నారు…. అభివృద్ధి చేయక పోతే ఇక వార్డుల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ అద్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భగంగా 15 అంశాలలో కూడిన అ జెండాను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికన్నా ముందు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జాతిపితకు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సచివాలయ సెక్రటరీలకు నివాళులు అర్పించారు. అనంతరం అజెండాపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఇర్షాద్, నాసిరబాను, అసిఫ్, రహమత్ బి, నాగేంద్రమ్మ అభివృద్ధి విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ వార్డుల్లో కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పటికీ ఏమాత్రం అభివృద్ధి పనులు జరగడం లేదని, ఈ విషయాన్ని చా లాసార్లు కౌన్సిల్ , అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదన్నారు. వెంటనే సంబంధిత గుత్తేదారులతో చర్చించి పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చైర్ పర్సన్ పోడియం ముందు బైఠాయించారు. మరోపక్క అధికార పార్టీకి చెందిన మరి కొంతమంది కౌన్సిలర్లు ఇదే విషయంపైన మాట్లాడారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రతి సమావేశంలోనూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అదేపనిగా అభివృద్ధి పనుల పై చర్చించకుండా సమావేశ సమయంలో అజెండాపై చర్చించకుండా అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇరు పార్టీ కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, వారు వినకపోవడంతో సమావేశాన్ని ఐదు నిమిషాల పాటు వాయిదా వేసి వెళ్ళిపోయారు. అనంతరం సభ ప్రారంభం అయింది. అజెండాపై చర్చించాల్సిన అధికార పార్టీ కౌన్సిలర్లు అజెండాలో ఉన్న అన్ని అంశాల పైన డీసెంట్ తెలుపుతూ చైర్ పర్సన్ ఇంద్రజకు లిఖితపూర్వకంగా లేక ఇచ్చారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తూన్నట్లు చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము వార్డు కౌన్సిలర్ లుగా ఎంపిక అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస అభివృద్ధి పనులు సైతం వార్డుల్లో చేపట్టలేదన్నారు. కల్వర్టు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కల్వర్టులు వేయాలని కోరుతున్నప్పటికీ ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదన్నారు. అయితే పురపాలక సంఘంలో 35 వ వార్డులో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు ఇలా పూర్తి చేశారన్నారు. కేవలం కొంతమంది కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయని, అదే పనులు మా వార్డులో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని, తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కౌన్సిల్ ఏర్పడినప్పుడు చైర్ పర్సన్ తొలి సంతకం పెట్టిన రైల్వే రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికీ చేపట్టలేదన్నారు. పట్టణంలో ప్రధాన అర్హదారులతోపాటు అంతర్గత రహదారులు అన్ని పాడైపోయినప్పటికీ ఏ ఒక్కరు, ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇది ఇలా ఉండగా ప్రతిపక్ష కౌన్సిల్ నేత రమేష్ కుమార్, టిడిపి కౌన్సిలర్లు మాట్లాడుతు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు వారు చేస్తున్న అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని భయపడి ప్రతి సమావేశంలోనూ అల్లర్లను సృష్టించి సమావేశాలు వాయిదా పడే విధంగా చేస్తున్నారన్నారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ అధికార పార్టీ కౌన్సిలర్లకు అవినీతి సామ్రాజ్యం అన్నారు. ప్రవేట్ బస్టాండ్ లో కొంత స్థలాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా కూరగాయల టోకు వ్యాపారులకు కేటాయించారు. ఇది చాలాదన్నట్టు తూ తూ మంత్రంగా వేలం పాటలు నిర్వహించి నూతనంగా నిర్మాణం చేసిన మార్కెట్ కింద భాగంలో ఎటువంటి అనుమతులు లేకుండా పూల వ్యాపారస్తులకు కేటాయించారు. ఇలా ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని వీటన్నింటిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రశ్నిస్తారని భయపడి అజెండాపై, ఆగిన అభివృద్ధి పనుల పైన చర్చించకుండానే సమావేశానికి వచ్చినట్టు సంతకాలు పెడుతున్నారు, సమావేశాన్ని వాయిదా వేస్తున్నారు. సమావేశం ఎప్పుడు నిర్వహించిన పురపాలక సంఘంలో జరిగిన అవినీతిపై తాము ప్రశ్నిస్తామన్నారు. పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలని అధికార పార్టీ టిడిపి కౌన్సిలర్లు హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article