Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుబాల రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న ఇమామ్‌కు ఫత్వా

బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న ఇమామ్‌కు ఫత్వా

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన తనకు ఫత్వా జారీ అయ్యిందని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసీ తెలిపారు. బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా ఉన్న ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసీ రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
తనకు కొందరు వ్యక్తిగతంగా ఫత్వా జారీ చేశారని, అలా చేసే అధికారం ఎవరికీ లేదని ఇమామ్ ఉమర్ ఇల్‌యాసీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందన్నారు. భారత్ విశ్వగురు కావడానికి చేస్తున్న ప్రయాణంలో దేశప్రజలంతా బలంగా ఒకటిగా ఉండాలన్నారు. ప్రస్తుతం దేశం భిన్నత్వంలో ఏకత్వం గల సర్వ ధర్మ సంభవ్ భారత్ అని వ్యాఖ్యానించారు. అందరి దేశమైన భారత్ గొప్పదని చెప్పారు. అయితే, రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లినందుకు తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఒక వర్గం తనపై దూషణభూషణలకు దిగిందని ఇల్‌యాసీ తెలిపారు. తన ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో షేర్ చేశారని, ఇతర మసీదు అథారిటీలు, ఇమామ్‌లను తనను బాయ్‌కాయ్ చేయాల్సిందిగా కోరారని ఆయన చెప్పరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article