కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. పొగమంచు కారణంగా షార్జ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా, చెన్నై నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమానాలు గాలిలో చక్కర్లు కొట్టాయి. విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. పైలెట్లు చాకచక్యంగా విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

