పుట్లూరు. నేడుఉదయం 10:00 గంటలకు పుట్లూరు మండలం లోని మడుగుపల్లి గ్రామంలో డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభిస్తారు. అనంతరం
ఉదయం 11:00 గంటలకు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో గ్రామ సచివాలయం,డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం మరియు డా.వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను ప్రారంభిస్తారు.
కార్యక్రమంలో నూతనంగా నియమించిన శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు పాల్గొంటారు.
కావున మండల కన్వీనర్, ఎంపీపీ, జెడ్ పి టి సి, ఎంపీటీసీలు , సర్పంచులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఎంపీపీ భూమిరెడ్డి రాఘవరెడ్డి తెలిపారు.

