పాదయాత్ర చేస్తున్న జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్
మార్కాపురం
మార్కాపురం పట్టణం నుంచి మొదలైన వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర రెండవ రోజు పెద్దయాచవరం నుంచి మన్నంవారిపల్లే , నాయుడిపల్లే మీదుగా రాయవరం నుంచి కలుజువ్వలపాడు వైపుగా జనసంద్రంతో విజయవంతంగా సాగుతుంది. ఈ పాదయాత్రకు మద్దతుగా అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన గ్రామస్థులు
మరియు దారివెంట సంఘీభావం తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కాపురం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

