కనిగిరి
డాక్టర్ సిహెచ్ గురు బ్రహ్మం ఆదివారం రాత్రి 10 గంటలకు చనిపోవడం జరిగిందని జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్ గయాజ్ భాషా తెలియజేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి సభ్యులు పాలూరి శివప్రసాద్ కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గయాజ్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. లలిత కళల పట్ల ఆయనకు ఎంతో మక్కువ ఎంతో ప్రోత్సాహంగా ఉండేవారని రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు శ్రీనివాసులు తెలియజేశారు. అదేవిధంగా ఆయనకి కళలపట్ల ఎంతో మక్కువ ఉందని అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని ఎంతో ప్రేమగా ఉండేవారని మా కుటుంబాల పట్ల కూడా ఆయనకు ఎంతో ప్రేమ ఉందని ఆయనకు ఉన్నటు వంటి అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేని గయాజ్ అన్నారు.
కనిగిరి ప్రాంత వాసుల మనసుల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి డా!! గురు బ్రహ్మం లేని లోటు తీర్చలేనిదని పలువురు వ్యాఖ్యానించారు. అభ్యుదయ కవి శ్రీశ్రీ అంటే ఆయనకు ఎనలేని ఇష్టమని శ్రీ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి గురు బ్రహ్మంగారు ఆయన పాటలు అంటే ఎంతో ఇష్టమని కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఆయన రచనలు అవన్నీ కూడా ప్రస్థానం తెచ్చి మాచే పాడించుకునేవారని గజల్స్ అన్న ఆయనకు ఎంతో ప్రేమని గయాజ్ ఆయనతో ఉన్నటువంటి అనుభూతుని మీడియా ముందు పంచుకున్నారు.
కళా తరంగిణి సాహితీ సుధా జనవిజ్ఞాన వేదిక ఘంటసాల స్వరాలయం ఎన్టీఆర్ కళానిధి ఇంకా పలు సంస్థల తోటి ఆయనకి ఎంతో సంబంధాలు ఉండేవని అన్ని కార్యక్రమాల్లో ముందే వచ్చి కూర్చొని ఆయన సలహాలు ఇస్తూ ఎంతో ఎంజాయ్ చేసే వారిని ఆ కార్యక్రమాల్లో పాల్గొని మంచి మంచి విషయాలను చెప్పేవారిని అన్నారు.
డాక్టర్ సిహెచ్ గురు బ్రహ్మం కుటుంబానికి షేక్ గయాజ్ భాషా పాలూరి శివప్రసాద్ కొండేటి వెంకటేశ్వర్ రెడ్డి పొన్నూరు శ్రీనివాసులు కొండారెడ్డి ప్రముఖ కవులు రచయితలు సంయుక్త ప్రకటనలో సంతాపం తెలియజేశారు.

