ఏలేశ్వరం:- ఏలేశ్వరం పట్టణ మరియు రూరల్ మండలాల శక్తి కేంద్ర ఇంచార్జుల సమావేశం రెడ్డి లోవరాజు గృహం వద్ద అసెంబ్లీ కన్వీనర్ ఘంటా బాలుదొర ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్,బీజేపీ రాష్ట్ర విస్తారక్ ఉన్ని కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూత్ కమిటీలు,శక్తి కేంద్ర ఇంచార్జుల బాధ్యతలు,పార్టీ బలోపేతం చేయడం గురించి వివరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో దేశవ్యాప్తంగా జరిగే గావ్ ఛలో అభియాన్ (పల్లెకు పోదాం) కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని చిలుకూరి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసి మోడీ ని మరొక్కసారి ప్రధానిని చేసి,రాష్ట్రంలో ఒకసారి బీజేపీ కి అవకాశం కల్పించాలని ప్రజలను కోరాలని నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియ జేయడం జరిగిందని, కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించారని రాష్ట్ర విస్తారక్ ఉన్ని కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి కాకినాడ జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు శింగిలిదేవి సత్తిరాజు, మూడు మండల అధ్యక్షులు గట్టిం వెంకట రమణ, కూరాకుల రాజా,కంద వీరాస్వామి, నియోజక వర్గ విస్తారక్ యార్లగడ్డ వెంకట్రాయుడు,జిల్లా కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ వెలుగూరి హరే రామ, జిల్లా సైనిక్ సెల్ కన్వీనర్ కర్రి ధర్మరాజు, జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు రెడ్డి వరలక్ష్మి, టౌన్ ఉపాధ్యక్షులు రెడ్డి లోవరాజు ,యస్ సి మోర్చ నాయకులు వజ్రంగి సల్మాన్ రాజు,విజయ్ థామస్ , గొల్లపూడి సత్యనారాయణ, గొల్లపల్లి త్రినాధ్ ,కొప్పిసెట్టి సత్తిబాబు,పతివాడ వెంకటేశ్వరరావు, బందం అనిల్ కుమార్ , మదినే బాబ్జీ, చింతాకుల రామకృష్ణ తదితరులున్నారు.