బీటెక్ రవికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం
పులివెందుల
పులివెందుల లో వైసిపి కుటుంబ పాలన పోయి, ప్రజా పాలన రావాలి అని మాజీ ఎమ్మెల్సీ, పులి వెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి ( బీటెక్ రవి) అన్నారు. ఆదివారం పట్టణంలోని మంగళ కాలనీ,రాజారెడ్డి కాలనీల లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ,బీటెక్ రవితో అడుగేద్దాం కార్యక్రమంలో బీటెక్ రవి ఆయన సతీమణి లతా రెడ్డి లు టీడీపీ -జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా కాలనీలో ప్రజలు ఆయనకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి సాగుతుందని, సీఎం జగన్ పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని విమర్శించారు. సొంత చెల్లి కూడా సీఎం పాలనను విమర్శించే అంత ఘోరంగా సీఎం పాలి స్తున్నారని తెలియపరిచారు.ఈకార్యక్రమంలో మండల ఇంచార్జిలు ,పులివెందుల మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.