పెనుకొండ
పెనుకొండ నియోజకవర్గం లోని గోరంట్ల మండలం పరిధిలోని పాలసముద్రం నాసిన్ ( నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ ) లో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన నాసన్ కంపెనీలో అగ్నిప్రమాదం జరగడంతో ప్రజల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. అకాడమీ లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి నల్లటి పొగ లు నూతన భవనాలు చుట్టూ ఆవరించడంతో గ్రామంలోని కొంతమంది యువకులు వాటిని గమనించి తమ సెల్ ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. స్థానికులు సైతం చరవాణిలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు,విలేకరులు నాసిన్ అకాడమీ వద్దకు వెళ్లగా అక్కడి సిబ్బంది ఇక్కడ ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగలేదని బుకాయించారు. ప్రధాన గేటు వద్దే ఆపివేశారు, అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించిందో వివరాలు తెలియ రాలేదు. ప్రమాదంలో విలువైన సామాగ్రి ఎంత మేర నష్టం వాటిల్లింది అన్న విషయాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ప్రమాదంపై నాసిన్ అధికారులు కనీసం వివరాలు తెలపడానికి కూడా ఇష్టపడలేదు. నూతన లైబ్రరీ భవనం లో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 3 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు తెలిసింది.