Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుహుందాతనం కోల్పోయిన చంద్రబాబువి చిల్లర మాటలు

హుందాతనం కోల్పోయిన చంద్రబాబువి చిల్లర మాటలు

  • ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
  • అనంతపురంలో రెండో రోజు ‘ఇంటింటికీ వైసీపీ’లో టీడీపీపై ధ్వజం

అనంతపురము
“రాజకీయాల్లో సీనియర్ అయిన, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. శనివారం ఉరవకొండలో టీడీపీ సభలో మాట్లాడిన మాటలు హుందాగా లేవు. జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిల్లర మాటలు మాట్లాడారు..”అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం అనంతపురం నగరంలో రెండో రోజు గడపగడపకు వైసిపి కార్యక్రమం కొనసాగింది. భవానీ నగర్‌ పైప్‌లైన్‌ రోడ్డు ఆటో స్టాండ్‌ నుంచి ప్రచారం ప్రారంభించారు.
ఇంటింటికీ వెళ్లి నాలుగున్నరేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలు పంపిణీ చేశారు. మరోసారి వైసీపీని ఆదరించాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రజలకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ.. శనివారం ఉరవకొండ టిడిపి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “ఎన్నికల సమయంలో ఒక మాట.. ఆ తర్వాత మరోమాట చెప్పడం చంద్రబాబుకు అలవాటే. హంద్రీనీవా గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. జిల్లాకు కృష్ణా జలాలు ఆలస్యం కావడానికి చంద్రబాబు, టీడీపీనే కారణం” అని అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.1985లో హంద్రీనీవాకు ఓడీసీ వద్ద ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేస్తే… 1995లో చంద్రబాబు ఉరవకొండలో 40 టీఎంసీలకు శంకుస్థాపన చేసి.. నాలుగేళ్లు ఏమీ చేయకుండా 1999లో దాన్ని 5 టీఎంసీలకు కుదించిన చరిత్ర చంద్రబాబుది” అని ఘాటుగా విమర్శించారు. అప్పట్లో కేశవ్‌ కూడా ఉరవకొండ ఎమ్మెల్యేగా ఉన్నాడని, కనీసం ఫౌండేషన్‌ ఖర్చులు కూడా ఇవ్వలేని చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. “2004లో వైఎస్‌. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక హంద్రీనీవా పనులు వేగం చేశారు. అప్పుడు నేను ఎంపీగా ఉన్నా. 2005లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి నీరు తీసుకొచ్చాం. 2012 నుంచి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయంటే అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలవే”నని పేర్కొన్నారు. హంద్రీనీవాను 3,850 క్యూసెక్కుల నుంచి 6 వేలకు పెంచుతామని రూ.1100 కోట్లు మంజూరు చేసి కనీసం గంపెడు మన్ను తీయని హీనచరిత్ర.. దరిద్రపు బతుకు చంద్రబాబుదని ఎమ్మెల్యే అనంత విరుచుకుపడ్డారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉండగా.. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు విలయతాండవం చేసింది. వలసలు పెరిగాయి. ఇది చరిత్ర చెప్పే నిజం” అన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెయిన్‌ గన్ల పేరుతో దోపిడీ చేశాడని గుర్తు చేశారు. 2 ఎకరాల నుంచి రూ.వేల కోట్లకు అధిపతి అయిన చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నాడని, టీడీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. 2019లో ఉమ్మడి అనంతపురంలో రెండు సీట్లు టీడీపీకి వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావు అని జోస్యం చెప్పారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామని పచ్చపత్రికల్లో రాతలు రాసుకుని భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. జనం గుండెల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సుస్థిర స్థానం ఉందన్నారు. “అనంతపురం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఎందుకు అభివృద్ధి చేయలేదు. అంతర్గత కలహాలతో ఐదేళ్లు కాలం వెళ్లదీశారు. నియోజకవర్గానికి ద్రోహం చేసిందే అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీనే అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article