కామవరపుకోట
స్థానిక కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయ బాబు ఆధ్వర్యంలో నేడు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు ప్రసంగిస్తూ రాజ్యాంగ ప్రాముఖ్యత గూర్చి వివరించడంతో పాటు రాజ్యాంగంలోని గొప్ప విలువలను అనుసరించాలని, రాజ్యాంగం పట్ల గౌరవభావంతో నడుచుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ గూడపాటి కేశవరావు బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయ్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు, అధ్యాపకులు డాక్టర్ జి శ్రీనివాసరావు, ఎం రామ్మోహన్, ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, ధారావతు మల్లేష్, వి.శ్రీనివాస్, ఎ.హర్షవర్థిని మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.