పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకోవాలో అన్న విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. పొత్తుకు ఇబ్బంది కలిగేలా మాట్లాడొద్దు అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని… అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానా? అని ప్రశ్నించారు.
కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అంటున్నారని… పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారు. .ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మనం మూడో వంతు సీట్లను తీసుకోబోతున్నాం..సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుంది.. అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రెండు సీట్లను ప్రకటిస్తున్నానని… రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు.