హిందూపురం టౌన్
హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో విభాగాధిపతులు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు స్థానిక కోర్టు ఆవరణలో అదనపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ జాతీయ జెండాను ఎగరవేయగా న్యాయమూర్తులు శ్రీధర్ రాజ్యలక్ష్మి సుకుమార్ పాల్గొన్నారు జాతీయ గీతాలాపన అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు నాగరాజు హిదయ తుల్లా ఖాన్ ఏ పి పి లు నగేష్ ఏజీపీ శ్రీనివాస్ రెడ్డి లతోపాటు న్యాయవాదులు పాల్గొన్నారు అలాగే పోలీస్ స్టేషన్లలో సిఐలు రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ స్వర్ణలత మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమోద్ కుమార్ అగ్నిమాపక కేంద్రం వ్యవసాయ కార్యాలయం మండల పరిషత్ మార్కెట్ యార్డ్ ప్రభుత్వాసుపత్రి ఐసిడిఎస్ తదితర కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతను వివరించారు అలాగే పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి