రామచంద్రపురం
రామచంద్రపురం ఆర్డీవో సుదాసాగర్ కి మోడరన్ విద్యాసంస్థల అధినేత జి.వి.రావు ప్రజాహిత అవార్డు ప్రదానం చేశారు.
ప్రభుత్వ,సామాజిక,రాజకీయ,క్రీడా,కళ, సేవా,విద్యారంగాలలో విశిష్ట సేవలు అందించే వారికి గత రెండున్నర దశాబ్దాలుగా మోడరన్ ఫౌండేషన్ వివిధ ప్రతిష్టాత్మక అవార్డులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కరానికి నిరంతరం కృషి చేస్తున్న సందర్భంగా ఆర్డీవో కి మోడరన్ ఫౌండేషన్ తరపున మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్ జి.వి.రావు ప్రజాహిత పురస్కారాన్ని గురువారం ఆర్డిఓ ఆఫీస్ లో జరిగిన ఓటర్ దినోత్సవ సభలో అందజేసారు.ఈ సందర్బంగా జి.వి.రావు మాట్లాడుతూ ఆర్డివో గా విధులు స్వీకరించిన అనతి కాలంలోనే సుధాసాగర్ ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించి పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందారని, ప్రజాస్వామ్య దేశానికి పండుగైన ఓటర్ దినోత్సవం నాడు ఈ అవార్డు అందజేయడం సబబుగా భావించి ఆర్డిఓ కి సగౌరవంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వయోవృద్దులు,దివ్యాంగులు అయిన ఓటర్ల సౌకర్యార్థం తమ మోడరన్ ఫౌండేషన్ తరపున ఇరవై వీల్ చైర్స్ అందజేస్తామని సభికుల కరతళ ధ్వనుల మధ్య రావు ప్రకటించారు.అనంతరం ఆర్డీవో సుధాసాగర్ మాట్లాడుతూ మోడరన్ ఫౌండేషన్ ద్వారా రావు చేసున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకం అని,ప్రత్యేక అవసరాలు గల ఓటర్ల సౌకర్యార్థం జి.వి.రావు వీల్ చైర్స్ అందజేయడం అభినందనీయం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోడరన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ సి.హెచ్.రాజేష్, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపాల్ పి.ఎస్.ప్రకాష్,ఇంటర్మీడియట్ అకడమిక్ అడ్వైజర్ సి.హెచ్.శ్రీనివాస్, మోడరన్ స్టాఫ్ ఎన్.ఎస్.ప్రభాకర్, కె.కృష్ణవేణి,మోడరన్ విద్యార్థులు పాల్గొన్నారు.