జగ్గంపేట
జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామంలో ప్రభుత్వo ఉత్తర్వులు అతిక్రమించి అక్రమంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన సమాచారం పై జగ్గంపేట ఎస్సై సిబ్బందితో కలిసి గుర్రప్పాలెం గ్రామంలో ఉన్న గండికోట సత్యనారాయణ వారి షాపులో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 43 మందు బాటిల్స్, లభించాయి. అదేవిదంగా గండికోట వీర రాఘవులు షాపులో తనిఖీ చేయగా 30 మందు బాటిల్స్ లభించాయి. ఆ మద్యం బాటిల్స్ మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జగ్గంపేట ఎస్సై k.నాగార్జున రాజు తెలియజేశారు.