జీలుగుమిల్లి
ఉత్తర ప్రాంతపు తేలికపాటి నేలలలో సిహెచ్ 3 రకం వర్జినియ పొగాకు అధిక దిగుబడి వస్తుందని డాక్టర్ మాగుంటి శేషు మాధవన్ అన్నారు. సిటిఆర్ఐ పరిశోధన స్థానం జీలుగుమిల్లిలోని సీటిఆర్ఐ ఫీల్డ్ పియర్స్ నిర్వహించే సందర్భంగా ఆయన అన్నారు. సిటిఆర్ఐ లో జరుగుతున్న పరిశోధనలో అనేక భాగాలు వెలుగు చూసయని వాటిలలో సిహెచ్ 3 రకం అధిక దిగుబడినోడుతో పాటు వాతావరణాన్ని కూడా తట్టుకుంటుందని ఆయన అన్నారు ఎఫ్ సి జే 11 వంగడం కంటే అధిక దిగుబడి వస్తుందని అన్నారు.
ఆకు పొడవు వెడల్పు మందంతోపాటు దిగుబడి కూడా అధికంగా ఉంటుందని అన్నారు. సి టి ఆర్ ఐ లో పొగాకుతో పాటు మిర్చి, పసుపు పైన కూడా వివిధ రకాల కు సంబంధించి పరిశోధన జరుగుతున్నాయని వాటి ఫలితాలను కూడా రైతులకు అందించగలుగుతున్నామని అన్నారు. వాటి ఫలితాలు రైతులు సద్వినియోగం చేసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే విధంగా దాఖలు పడుతుందని ఆయన అన్నారు. బాగా పనిచేస్తుందని వీటిలో అనేకమైనటువంటి వంగడాలను సృష్టించగలిగామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ హెడ్ కే సరళ డాక్టర్ బి రాజశేఖర్ డాక్టర్ ఎల్వి ప్రసాద్ సిటిఆర్ఐ జీలుగుమిల్లి హెడ్ వై సుబ్బయ్య కస్తూరి కృష్ణ మరియు స్థానిక శాస్త్రవేత్తలు సిటిఆర్ఐ సిబ్బంది పాల్గొన్నారు.