బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని..నేను ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని తెలిపారు. నేను రిటైర్మెంట్ ప్రకటించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె వివరించారు.