దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి బుధవారం ఆయన స్వగ్రామం వెంకటాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పరిటాల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వెంకటాపురం జనసంద్రంగా మారింది.మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం పరిటాల శ్రీరామ్ తదితరులు పరిటాల రవీంద్ర ఘాటు వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.