అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విమానాశ్రయం చేరుకోగా అక్కడ ముఖ్యమంత్రికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో అనంతపురంజిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.