వేలేరుపాడు,
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వేలేరుపాడు మండలంలో భారీ ఎత్తున శోభాయాత్ర జరిగింది, ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు, గతంలో ఎన్నడు లేని విధంగా భక్తజనులు రామభక్తిని చాటుకునేందుకు శోభాయాత్రలో పాల్గొనడం విశేషం, వందలాది ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, వ్యాన్లు ఈ యాత్రకు స్వచ్ఛందంగా కదిలి వచ్చాయి, వేలేరుపాడు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన సౌభాయాత్ర జగన్నాధపురం, ఎర్రబోరు, నాగులగూడెం, శివకాశి పురం ,పూచిరాలకాలనీ, బుర్రతోగు గ్రామాల మీదుగా భూదేవి పేట వరకు కొనసాగింది, భక్త కమిటీ వారు ఏర్పాటుచేసిన శ్రీరాముని చిత్రపటానికి అడుగడుగున భక్తులు పసుపు కుంకాలుతో పూజలు నిర్వహించి, టెంకాయలు, పళ్ళు, ఫలాలతో, నైవేద్యాలు సమర్పించుకొని పునీతులయ్యారు, శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా, మండలంలో వ్యాపార కూడళ్ళు స్వచ్ఛందంగా మూసివేసి ఆడ మగ పిల్లపాపలతో శోభాయాత్రలో పాల్గొన్నారు, అధ్యంతం భక్తజన సందోహం మధ్య కొనసాగిన శోభాయాత్రలో చివరి వరకు భక్తజనులు యావత్తు పాల్గొని, అనంతరం భక్త కమిటీ వారు ఏర్పాటుచేసిన పులిహార, పొంగలి, ప్రసాదాలతో పాటు మజ్జిగను ప్రసాదములా స్వీకరించారు, ఈ కార్యక్రమ రూపకర్త చిట్టిపోతుల పోసి ఆధ్వర్యంలో ,కమిటీ సభ్యులు రాయుడు మోహన్రావు, శ్రీనివాసరావు, కోడూరి నరసింహారావు, గణేష్ ,బెజవాడ పోసి, పసుమర్తి దుర్గాప్రసాద్, పురుషోత్తం, హరిబాబు, కూనారపు సత్యనారాయణలతో పాటు మరి ఎంతోమంది కమిటీ సభ్యులు శోభాయాత్రను విజయవంతం చేయడంలో కృతార్థులయ్యారు.