Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుమన రాముడు మళ్లీ వచ్చాడు...ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కాదు, భారత విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్టఅయోధ్యలో...

మన రాముడు మళ్లీ వచ్చాడు…ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కాదు, భారత విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్టఅయోధ్యలో ప్రాణ ప్రతిష్ట తర్వాత మోడీ

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడని ప్రధాని మోడీ పేర్కొన్నారు.ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడన్నారు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు అని మోడీ చెప్పారు.
2024 జనవరి 22 సాధారణ తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక.. ఇది కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయం అని మోడీ అన్నారు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం తన అదృష్టమనొ…తన మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉందన్నారు రామ మందిరాన్ని న్యాయ బద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించినట్టుగా మోడీ గుర్తు చేశారు. బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారని మోడీ చెప్పారు.
రాముడు భారత దేశ ఆత్మ అని…అన్ని భాషల్లో తాను రామాయణాన్ని విన్నానని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడన్నారు.
ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.పవిత్ర అయోధ్యపురికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని…ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడిని వేడుకుంటున్నట్టుగా మోడీ చెప్పారు.ఈ క్షణం కోసం అయోధ్య వాసులు వందల ఏళ్లుగా ఎదురు చూశారన్నారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. 500 ఏళ్ల కల సాకారమైనందుకు దేశ ప్రజలంతా దీపావళి జరుపుకుంటున్నారని మోడీ పేర్కొన్నారు.
ఈ శుభ గడియల కోసం 11 రోజులుగా దీక్ష నిర్వహిస్తున్నట్టుగా మోడీ చెప్పారు. దేశంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. సాగర్ నుండి సరయూ నది వరకు రామ జపం నిర్వహించినట్టుగా ప్రధాన మంత్రి మోడీ చెప్పారు.రామ నామం.. దేశ ప్రజల ప్రతి కణకణంలో ఉందని మోడీ పేర్కొన్నారు.రాముడు వివాదం కాదు….రాముడు సమాధానమని మోడీ చెప్పారు.రాముడు నిత్యం…రాముడు నిరంతరం…రాముడు అనంతమని మోడీ తెలిపారు.మన దేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలమన్నారు.
రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని ప్రధాని చెప్పారు.ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనంగా పేర్కొన్నారు.ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడ సూచికగా ప్రధాన మంత్రి తెలిపారు.కొందరు వ్యక్తులు మన సమాజా ఆత్మను అర్ధం చేసుకోలేపోయారన్నారు. 500 ఏళ్లుగా రాముడి ఆలయం ఎందుకు నిర్మాణం కాలేదో ఆలోచించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.
రాముడు అగ్ని కాదు.. రాముడు వెలుగు అని కూడ మోడీ పేర్కొన్నారు. ఇది విగ్రహా ప్రాణ ప్రతిష్టే కాదు, భారత విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ట అని ప్రధాని చెప్పారు. ఇది ఆలయమే కాదు, భారత చైతన్యానికి ఆలయంగా మోడీ పేర్కొన్నారు.రాముడే భారత్ ఆధారం.. రాముడే భారత్ విధానమని మోడీ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article