ఏపీసీసీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారని చెప్పొచ్చు. అప్పుడే జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు షర్మిల. ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించడానికి రూట్ మ్యాప్ ఖరారైంది. 23న నుంచి ఆమె పర్యటన ప్రారంభం అవుతుంది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు యాత్ర చేపట్టబోతున్నారు షర్మిల. అలాగే అన్ని జిల్లాల్లోనూ కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. దాదాపు 9 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతోంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రెండు జిల్లాల సమావేశం నిర్వహించబోతున్నారు.
ప్రతిరోజు రెండు జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు , కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, జిల్లాలలో పార్టీ పరిస్థితి, నూతన చేరికలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు వైఎస్ షర్మిల.