తాజా వార్తలుదసరా పరోక్ష ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ ప్రారంభం.

దసరా పరోక్ష ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ ప్రారంభం.

ఆన్‌లైన్ వెబ్‌సైట్: https://tms.ap.gov.in
​‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్: 9552300009

​11.10.2026 నుండి 20.10.2026 వరకు నూతన పూజా మండపంలో విశేష సేవల లైవ్ ద్వారా
​ఇంటి వద్ద నుంచే వర్చువల్ లింక్ ద్వారా భక్తులు వీక్షించే అవకాశం – పోస్టు ద్వారా ప్రసాదాల బట్వాడా

ప్రజాభూమి ప్రతినిధి,​ఇంద్రకీలాద్రి:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (11.10.2026) నుండి విజయదశమి (20.10.2026) వరకు అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ప్రత్యేక పరోక్ష (వర్చువల్) ఆర్జిత సేవా టికెట్లును శుక్రవారం మధ్యాహ్నం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ఈవో వికె శీనా నాయక్, స్థానాచార్య విడుదల చేశారు.దేవస్థానం పూజా మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చన సేవలను భక్తులు ఇంటి వద్ద నుంచే పరోక్షంగా వీక్షించవచ్చు.భక్తుల పేర్లు, గోత్రాలు అమ్మవారి ముందు చదివి పూజ జరిగేదాన్ని భక్తులు లైవ్ ద్వారా వీక్షించి పూజలో పాల్గొనవచ్చు.
ఈ సేవా టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారిక పోర్టల్ https://tms.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ, లేదా ప్రభుత్వ ‘మనమిత్ర’ అధికారిక వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా గానీ అత్యంత సులభంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ తెలిపారు.

​పరోక్ష సేవల రుసుము వివరాలు :
​ఒక రోజు పూజా టికెట్ రుసుము: రూ. 1,500/- కాగా అదే పూజ
​10 రోజుల పాటు కంటిన్యూగా చేయించుకునే ప్యాకేజీ రుసుము: రూ. 11,116/- (నవరాత్రుల మొత్తం 10 రోజులకు సంబంధిత సేవకు)
​భక్తులకు పంపే ప్రసాదములు: ఉత్సవాల అనంతరం భక్తుల చిరునామాకు అమ్మవారి శేష వస్త్రము, రవిక ముక్క, శ్రీచక్ర పీఠం, ల్యామినేషన్ ఫోటో (5×7), కుంకుమభరిణె మరియు రక్షా కంకణములు పోస్టు ద్వారా పంపబడతాయి.

పరోక్ష సేవ బుకింగ్ చేసుకునే భక్తులకు ముఖ్య సూచనలు:​ పరోక్ష సేవా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానంలో ప్రత్యక్షంగా పూజలో పాల్గొనుటకు గానీ, శ్రీ అమ్మవారి దర్శనానికి గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు.

​పూర్తి వివరాల నమోదు: టికెట్ బుక్ చేసుకునే సమయంలో భక్తులు తమ గోత్రనామాలను స్పష్టంగా నమోదు చేయాలి. అలాగే ప్రసాదం పోస్టు ద్వారా చేరడానికి వీలుగా ఇంటి నెంబరు, వీధి, గ్రామం/పట్టణం, మండలం, జిల్లా, పిన్ కోడ్ మరియు మొబైల్ నెంబర్‌తో కూడిన పూర్తి చిరునామాను విధిగా సమర్పించాలి.​ఆన్‌లైన్ వెబ్ లింక్ (Virtual Seva): సేవా టికెట్ పొందిన భక్తులు దేవస్థానం వారు అందించే ఆన్‌లైన్ వెబ్ లింక్ (Online Web Link) ద్వారా లైవ్‌లో పూజా క్రతువును వీక్షిస్తూ తమ గృహాల నుండే సంకల్పంలో పాల్గొనవచ్చు.విదేశాల్లో ఉండేవారు,​దూరప్రాంతాల భక్తులు, నేరుగా రాలేనివారు, ఈ సదుపాయాన్ని వినియోగించుకుని https://tms.ap.gov.in వెబ్‌సైట్ లేదా 9552300009 మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా పరోక్ష సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని దేవస్థానం చైర్మన్, ఈవో విజ్ఞప్తి చేసారు.ఈ పరోక్ష పూజా టిక్కెట్ల విడుదల కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article