ఆయన గీసిందే గీత..
ఆ గీతలోనే ఎంతో కత..
అందులోనే
సామాన్యుడి వెత..
అతగాడి గుండెకోత..!
ఆర్ కె లక్ష్మణ్..
ఆయన గీచేవి పేరుకే కార్టూన్లు..
అప్పుడప్పుడు అవి సగటు మనిషి ఫార్ట్యూన్లు..
టైమ్స్ ఆఫ్ ఇండియాతో
ఆయనెప్పుడో అయ్యాడు
పానిండియా..!
తొలిచూపులోనే నవ్వు..
రాజకీయ నాయకుడి
చెవిలో పువ్వు..
లక్ష్మణ్ కార్టూన్లు..
బట్టతల..కళ్ళజోడు..
గళ్ళ కోటు..
నాటి సగటు మనిషికి
మరో రూపం
ఆర్ కె హీరో…
పంచాయతీ నుంచి
ప్రధాని కార్యాలయం వరకు
ఆ కామన్ మన్ చక్కర్లు..
ఆ కథలే టైమ్స్ పత్రికలో
YOU SAID IT..శీర్షికతో
మొదటి పేజీ స్టిక్కర్లు..
భలే మజాగా పేలే క్రాకర్లు!
అన్న ఆర్కే నారాయణ్
దిమ్మ తిరిగే కథకు
తమ్ముడు లక్ష్మన్న
అదిరిపోయే బొమ్మ..
మాల్గుడి డేస్ తో సహా
ఆయన అనిపించాడు
బొమ్మలతో ఆహా!
అన్నట్టు..ఆర్కే లక్ష్మణ్
సగటు మనిషి
విగ్రహమై బొంబాయి
వర్లి తీరంలో వెలిశాడు..
తన సృష్టికర్త పేరును
శాశ్వతం చేశాడు..!
✍️✍️✍️✍️✍️✍️✍️
(FORTUNATE ENOUGH
THAT I HAVE INTERVIEWED THE LEGEND WHEN I WAS WORKING FOR INDIAN EXPRESS GROUP)
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286

