- 24/7 మందుబాబుల సేవలో రోబో డిన్నర్
- సాంకేతికతో సరికొత్త వ్యాపారం…
- రోబో తో రెసి అంటూ బార్ లో రైడ్స్…
- పట్టించుకోని ఆబ్కారీ శాఖ…
*అయ్యో ఇదేమిటి అంటున్న ఆధ్యాత్మిక వేత్తలు…
ప్రజాభూమి ప్రతినిధి, తిరుపతి:



తిరుపతి అత్యాధ్మిక నగరంలో అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. పవిత్రతకు, భక్తికి పేరుగాంచిన నగరం, అపవిత్రతకు, అపచారాలకు కేంద్ర బిందువుగా మారుతుందని, భక్తులు, హిందు మత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో రోబో డిన్నర్, బార్ నిర్వాహకులు “అత్యాధ్మిక నగరంలో, అన్ని వేళల మందు” అందుబాటులో అనే విధంగా వ్యవహరిస్తున్నారు. 24/7 మందుబాబుల సేవలో ఉంటూ లక్షలు సంపాదిస్తూ సంబంధిత శాఖలను సైతం తమ గుప్పెట్లో పెట్టుకున్నారని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభూమి ప్రతినిధి అర్ధరాత్రి సమయంలో వెళ్లి పోలీసు విభాగంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న 100 కి ఫోన్ ద్వారా సమాచారం చేరవేయగా బ్లూకోట్ పోలీసులు సైరన్ తో మందు బాబులకు, విక్రయదారులైన రోబో డిన్నర్ బార్ నిర్వాహకులకు పరోక్షంగా మెసేజ్ అందే విధంగా సైరన్ వేసి వారిని అప్రమత్తం అయ్యే విధంగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఇటీవల కాలంలో తిరుపతి నగరంలో యువత కత్తులు తిప్పి ప్రజలను భయంఆందోళన కు గురిచేయడం, మహిళలు, ఆడపిల్లలను రోడ్డుపై ఇబ్బందులకు గురిచేయడం, బీరు బాటిళ్లుతో దాడులు చేయడం వంటి అనేక సంఘటనలు తిరుపతి నగరంలో ప్రతి రోజు దర్శనమిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అత్యాధ్మిక నగరంలో అన్ని అపచారాలే తప్ప భక్తిని, తిరుపతి ప్రతిష్ఠని కాపాడే పరిస్థితి లేదని భక్తులు, హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి..
ఈ విషయాన్ని ఎక్సైజ్ విభాగ సీఐ రామచంద్రకి ఫోన్ ద్వారా తెలియజేయగా, ఆశ్చర్యకరంగా ఆ సీఐ బార్ యజమానికే సమాచారం చేరవేసారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బార్ యజమాని స్వయంగా సీఐకి సమాచారం ఇచ్చారని తెలుసు, అయినా తమని ఎవరూ ఏమీ చేయలేరనేసంకేతాలు ఇస్తుండటమే అబ్కారీ శాఖ అధికారులపై అనేక అనుమానాలు రేకిస్తున్నాయి., పై అధికారులకు చెప్పినా తమకేమీ కాదనే ధోరణిలో వ్యవహరిస్తున్న తీరును చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ఈ ఘటనతో ఎక్సైజ్ అధికారుల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతిలో ఇలాంటి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కొనసాగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో నేరాలు, అత్యాచారాలు, మానభంగాలు పెరగడం అనివార్యమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పవిత్రతను కాపాడే విధంగా ఉండాల్సిన నగరం, ఇప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా మద్యం విక్రయ కేంద్రంగా మారుతున్నది. ఈ విషయం పై భక్తులు, మత సంఘాలు, స్థానికులు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే, తిరుపతి నగరం భక్తి, పవిత్రతను కాపాడే దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు భక్తులకు ఇబ్బందులు, నగర ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సమయంతో పని లేకుండా నగరంలో కొనసాగుతున్న అక్రమమద్యం అమ్మక కార్యకలాపాలు భక్తుల ప్రార్థనలకు, పుణ్యప్రయాణాలకు అంతరాయం కలిగిస్తున్నాయని, భక్తులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారుతున్న నగరంలో భక్తి, పవిత్రతను కాపాడడం, సాంప్రదాయ విలువలను రక్షించడం కోసం, సంబంధిత శాఖలు వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో భక్తి, శాంతి, పవిత్రతను కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ముందు తరాలకు అత్యాధ్మిక నగరంగా ఒకప్పుడు తిరుపతి ఉండేదని చెప్పుకోవసిన పరిస్థితి వస్తుందని ప్రజలు, భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

