- తిరుచానూరులో కోట్లు విలువైన ఆస్తులు
- అనుమతులుకు మించి కట్టడాలు
- ఆయన అవినీతి రహస్యం కళ్యాణ వెంకటేశ్వర స్వామికేరుక!
ప్రజాభూమిబ్యూరో – తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో నెలవారీ వేతనంతో ఉద్యోగం ప్రారంభించిన ఓ ముని బాలుడు తిరుమల అనుబంధ ఆలయాలలో పనిచేస్తూ ప్రస్తుతం సూపరింటిడెంట్ గా కొనసాగుతూ ఇప్పుడు కోట్లు విలువైన ఆస్తులకు యజమానిగా, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని తిరుపతిలోని అనేక వర్గాలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ వేతనం పొందే ఉద్యోగి ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో తెలుసుకోవడానికి ప్రజల్లో తీవ్ర ఆశక్తి నెలకొంది. అవినీతి ‘రహస్యం’ పెరుమాళ్ కేరుక సహోద్యోగుల మాటల్లో, ఈయనకు అవినీతి అంటే ఇదే అనగల రీతిలో పేరుంది. టీటీడీలో వివిధ విభాగాల్లో పనిచేసిన కాలంలో అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు, కేసులు నమోదైనప్పటికీ, టీటీడీ అతన్ని సస్పెండ్ చేసినప్పటికీ, తన ధనబలంతో వాటిని మసకబార్చాడని ధన బలంతో ఆ కేసులను ప్రారంభ దశలోనే ఉంచి తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారని సమాచారం. కోట్లు విలువ చేసే ఆస్తులు, విలాసవంతమైన జీవితం, విశ్వసనీయ వర్గాల ప్రకారం, తిరుపతిలో ఆయనకు కోట్ల విలువ చేసే భవనాలు, స్థలాలు, విలాసవాహనాలు ఉన్నాయి. సాధారణ వేతనంతో పోలిస్తే వందల రెట్లు ఎక్కువ సంపద ప్రజల్లో ఈ సంపద ఎక్కడి నుండి వచ్చిందో? అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. చేసేది అవినీతి, చెప్పేది శ్రీరంగ నీతులు అనే సామెత ఆయన జీవన విధానానికి సరిపోతుందని సమీప వర్గాలు చెబుతున్నాయి. టీటీడీలో భక్తి, నిజాయితీతో సేవ చేయాల్సిన ఉద్యోగి అక్రమంగా తన ఉద్యోగాన్ని అమ్ముకుంటూ సంపన్నులకు విఐపి ప్రోటోకాల్ దర్శనాలు చేపిస్తూ కోట్లు గడించి విలాసంలో మునిగితేలడం, ధార్మిక సంస్థ టీటీడీ ప్రతిష్టను మసకబరచడం మహా పాపమని సహచర ఉద్యోగులు వాపోతున్నారు.
హత్యచార ఘటనలో ఆయన పాత్ర
తిరుమలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో సప్తగిరి గెస్ట్ హౌస్ నందు ఒక అత్యాచార కేసులోనూ ఆయన పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పైన అనేక ఆరోపణలు, అనేక కేసులు ప్రారంభ దశలోనే ఉన్నాయనేది అక్షరసత్యం. టీటీడీ ఉన్నత అధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్రమ సంపదను స్వాధీనం చేసుకోవాలని, బాధ్యతాయుతంగా ఆయనను శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో భక్తి, నిజాయితీతో పనిచేయాలనే తీరుకు విరుద్ధంగా ఈయన జీవితం మాయని మచ్చ అని సహోద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ నెల వేతన ఉద్యోగి నుంచి కోట్లు విలువైన ఆస్తుల యజమానిగా మారిన ఈ ఘటన, ఇప్పుడు తిరుపతిలోని ప్రజలు, ప్రజాసంఘాల చర్చలకు కేంద్రబిందువైంది. ప్రజలు, స్థానికులు, భక్తులు, అధికార వర్గాలు అందరూ ఈ అవినీతి తిమింగలం గురించి కథల కథలుగా చర్చించుకుంటున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి.
తిరుచానూరులో తుడా అధికారుల సహకారంతో ఆక్రమ కట్టడాలు
తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరులో ఈ అధికారికి ఒక భవనం నిర్మాణంలో ఉంది. తిరుచానూరులో పవనాలు 6 అంతస్తులు వరకే అనుమతులు సదరు టిటిడి ఉద్యోగి తుడా అధికారులు అవినీతిమాయతో భవనాలు ఆకాశాన్ని హద్దుగా నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పటికైనా టీటీడీని ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం, టిటిడి, తూడ ఉన్నతాధికారులు స్పందించి సదరు అధికారి అక్రమ ఆస్తులపై విచారణ చేపట్టి తన నిర్మిస్తున్న అనుమతులు లేని భవనాలపై చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

