జీలుగుమిల్లి
అంగన్వాడి సెంటర్లు మూతపడడంతో పిల్లలకు అంగన్వాడీ సరుకులు అందక పిల్లల తల్లిదండ్రులు లబోదిబో అంటున్నారు. గడచిన 42 రోజుల నుండి అంగన్వాడీలు ధర్నాలు చేస్తూ ఉంటే మా పిల్లలు కడుపులు మాడుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం ఏమైనా పరిష్కారం చూపి పిల్లలకి అందించవలసినటువంటి పోషకాలను అందించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు .గుడ్లు, పాలు పాలపిండి ఖర్జూర వంటి పదార్థాలతో పాటు బాలింతలకు గర్భిణీలకు ఇవ్వాల్సినటువంటి ఆహార పదార్థాలు కూడా ఇవ్వకపోవడంతో ఇప్పటికైనా సెంటర్లలో నిలువ చేసినటువంటివి వాటిని ఎలకలు వంతు సీమల వంతు అయ్యే పరిస్థితి నెలకొందని ఒక పక్కన లబ్ధిదారులు వాపోతున్నారు . ఏజెన్సీ ద్వారా వచ్చే వస్తువులను ఆయా పంచాయితీల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది నిలువలను దింపుకుంటమే తప్ప ఎక్కడో కూడా పంచిపెట్టిన పాపాలు లేదని వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు లేదా అంగన్వాడీల దీక్షను నిరూపి చేసి మాకు వస్తువులు మరియు సరుకులు అందజేయండి అంటూ పిల్లల తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. రెండు నెలల నుండి పోషక పదార్థాలు అందక ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణీలు బాలింతలు శిశువులు మరింత బక్క చిక్కే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ ప్రాంతంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం మంచూ విపరీతంగా పెరగడం జలుబులు జ్వరాలతో చిన్నపిల్లలు బాలింతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చి పిల్లలను పరీక్షించి తగు జాగ్రత్తలు తీసుకుని వైద్యాధికారులు కూడా లేకపోవడంతో ఆయా ప్రాంతంలోని పిల్లలు జ్వర పీడితులై బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అంగన్వాడీలన పునర్దించండి లేదా మాకు సరికి లానే ఇచ్చే ప్రయత్నం ప్రయత్నం చేయండి అంటూ పిల్లలు తల్లిదండ్రులు వాపోతున్నారు . ఒక పక్కన ఇచ్చిన కోడిగుడ్లు మురిగిపోయే ప్రమాదం ఉంది. ఆయా ప్రాంతాలలో దించుకున్న సరుకులు ఎలుకలు చీమల పాలు అయ్యే పరిస్థితి నెలకొంది. మరికొన్ని సరుకులు బూజుపెట్టే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా సరుకులను పాడవకుండా సచివాలయ సిబ్బందితో కానీ పంచాయతీ సిబ్బందితో కానీ ఎవరితో ఒకరితో ఆ గ్రామాల్లోని గృహిణులకు బాలింతలకు పిల్లలకు అందజేసి పిల్లల ప్రాణాలను కాపాడాలంటూ ఏజెన్సీ ప్రాంతపు ప్రజలు కోరుతున్నారు.
అంగన్వాడీల గొంతెమ్మల కోరికలను పక్కన పెట్టండి
రాష్ట్రంలో వేలాదిమంది యువతీ యువకులు డిగ్రీలు పీజీలు చేసి సచివాలయం సిబ్బంది గా 15 వేల రూపాయలకు జీతాలు వెలగబేడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం 26 వేల రూపాయలు ఇస్తానని అదే ఇవమని కోరడం కూడా గ్రామీణ ప్రాంతాలలోనూ పలువురు విశ్వమయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కూడా కొన్ని సమస్యలు పరిష్కరిస్తాం కి ముందుకు వస్తున్న ట్రేడ్ యూనియన్లు నాయకులు పట్టు పట్టి మెట్టు దిగక ఇటు పిల్లల్ని అటు అంగన్వాడీలను బలు పశువులు చేసే పరిస్థితి నెలకొందని ఏజెన్సీ ప్రాంతంలో పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో కూడా అంగన్వాడీలపై ఆగ్రహం రాక ముందే సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నారు.అంగన్వాడీలు కూడా పని భారం పెరుగుతుందని యాపూలు తీసేయమని అవి తీసేయండి ఇవి తీసేయండి అంటూ ధర్నాలు చేయడం కూడా ఉంది . అంగన్వాడీలు కూడా పిల్లలను గర్భిణీ స్త్రీలను బాలింతలను దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకైనా ఒక అడుగు వెనక కైనా జరిగి సమస్య పరిష్కరించుకోవాలని యావన్మంది ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.