- ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం అందించే ఏర్పాట్లు ఉన్నాయి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ



విజయవాడ:అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ, ఈవో శీనా నాయక్, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం పరిశీలించి భక్తులతో స్వయంగా మాట్లాడి, ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్న ప్రసాదం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఎంతమంది వచ్చినా అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రసాదం స్వీకరించిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. భక్తుల అభిప్రాయాల మేరకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా యుద్ధప్రాతిపదికన చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

