Sunday, September 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్కూటికే లేక ఎన్నో కాపురాలు కూలుస్తూ..?

కూటికే లేక ఎన్నో కాపురాలు కూలుస్తూ..?

  • వేసుకోవడానికి కోటు లేదు..కేసు కోసం కోటి కొట్టేసారని కూస్తుంటే…!
    *కోర్టు నోటీసుకు కట్టడానికి దిక్కులేక…
    *కానీ పనులుకు పోతూ ఖాఖీల కంట పడితే…
    *కాపురానికి సిద్ధపడ్డ ఓ ఖాఖీ పూచి పడి కాపాడితే…
    *టిళ్లు.. ఓ టిల్లు మన టిల్లు త్రిల్లే వేరంటూ ఎన్నో చేసి…
    *ఎందరినో ఏదో మాయజేసి..
    *బేబి లోన బేబి ఏదో చేస్తుందంటే..
    *ఎగిరి గంతేసి ఎలక్ట్రానిక్ బైక్ ఇస్తే ..
    *అమ్మ జ్యూసు..నాన్న గ్లాసు ఇస్తే…
    *ఆత్మ కథల తో ఆశలు కథ బైటికి రాకుండా చేస్తూ ..
    *రాజుగారి పాలెం రహదారికూడా గుంతలు మయం అయ్యేలా…
    *రంగు రాల్లోడిని రోడ్డు పాలు చేసి…
    *పిండం పెట్టె సాకుతో పుండు పుట్టిన వాడితో .. ?
    *రామా నీ గాణమే రారా అంటుందని అని…
    *నీ కూని రాగాలు వింటుంటే కలకాలం ఉండాలని ఉందని…
    *ఆ కుంటి వాడిని కానరాని లోకాలకు పోయేలా చేసి…
    *కూ.. కూ అమ్మతో కబుర్లు చెప్పి ..
    *కానీ పనులు బైటికి రాగానే కీచులాట పెట్టుకుని…
    *పిండాలంటే పాచిపోయిన లడ్డుల్లాగా భావించి…
    *అందాల మాటున ఎందరి బ్రతుకులను అల్లరి పాలు చేసి ..
    *అందిన కాడికి దోచుకుని… *డబ్బడిగితే అందుకు సరిపోలేదా అంటూ…
    *దుబాయ్ రాజన్ కూడా దడిసి పోయి..
    *నా బ్రతుకు నిలబెట్టింది నా వాళ్ళు కాదని కూసి…
    *గ్రంధాలయంలో గావురమని గగ్గోలు పెట్టి…
    *హితులు ఒకరి ఒకరు పోటీ పడి నీతులు చెప్పగా ..
    *ఆ హితులని గోతిలో దింపితే ..
    *వారు ఆ మత్తు మరవలేక అవేదన చెందుతుంటే
    *హైదరాబాద్ శంకరుడుకి శఠగోపురం పెట్టి …
    *బుల్లెట్ బండి ఫేమ్ ని ఫామ్ లోకి దింపి బురిడీకొట్టించి …
    *ఓ నైస్..యా..ఎస్ అంటూ ఊరందరిని ఉచ్చులోకి దింపి…
    *తాలినే ఎగతాళి చేసేలా..తా రెడ్డితో చేసిన…!
    *మామయ్య అంటూ ముసలోడిని ముగ్గు లోకి దింపి బుగ్గి పాలు చేసి…
    *కోటప్పకొండ లో కొత్తకారెక్కి…
    *బాపట్ల బీచ్ లో భూమి పూజ మొదలై…
    *కాంతుడి కళ్ళలో కొత్త కాంతులు నింపితే…
    *కారుచీకట్లలో మునిగి కర్నూలు కు పోయి…
    *చేయి అందించిన వాడికి హ్యాండిచ్చి…
    *ఓ కాంతుడా నీకిక చీకట్లు తప్పవేమో …
    *ఈ కాంతతో ఎన్నో జీవితాల్లో చీకట్లు నిండాయే ..
    *ఈ చీకటి ఒప్పందాలకు చెల్లు చీటి పడవా…
    *కాంతా ఓ కాంతా నీ కట్టు కథకు ముగింపు ఉండదా…
    ఎవరీ కాంత… ఏమిటా కథ…
  • (సమాజంలో బైటికి రాని ,బైట పడని జరిగిన జరుగుతున్న కథ)
  • కామా తురాణం నభయం నలజ్జ అన్న సామెతకే అసహ్యం పుట్టేలా ఆడదాని జీవితానికే రోత పుట్టిచేలా కొత్త కొత్త కూతలు కుస్తూ గానం ముసుగులో మానని గాయలెన్నో చేసి చేస్తూ కూడా గాడి తప్పిన జీవితాన్ని సరి చేసుకుందామనే కనీస జ్ఞానం లేక కొత్త గూడు కోసం వెతుకుతూ గాలి పనులు చేస్తున్న ఓ గడసరి జీవిత చరిత్ర ఉంటే ఒళ్ళు గగుర్పాటు చెందక పోతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరి గడుసరి అని గుర్తు చేసుకుంటే…వివరాలు ఇలా ఉన్నాయి…ఆనగనగా ఒక పల్లెటూరులో ఒక సాధారణ కుటుంబం లో జన్మించిన ఓ యువతి అతి చిన్న వయసులోనే వయస్సు కు మించి పనులు చేస్తుంటే వివాహం చేసారు.వివాహం అనంతరం తన భర్త ఉన్నత చదువులు చదివించి చక్కటి జీవితాన్ని ఇచ్చి పచ్చని సంసారం లో పండంటి ఇద్దరి మగ బిడ్డలతో హాయిగా సాగుతూ ఉండగా ఉన్నత చదువే అతనికి ఉరి తాడుల తయారు అయింది.అమాయకంగా ఉన్న ఈ ఆడది భర్తనే అమాయకుడు ని చేసి గుజరాత్ గలత్ పనులకు మొదలు పెట్టింది.గమనించిన భర్త గాడితపుతుందని గొడవ చేస్తే అమ్మ జ్యుసు ఇస్తే నాన్న గ్లాసు అందించడం అలవాటున్న ఆ కుటుంబం ముక్కు పచ్చలారని పిల్లలు వదిలి దుబాయ్ కి పోయి దిక్కుమాలిన పనులెన్నో చేసి దుబాయ్ రాజన్ ని తాళి కట్టమని ఆడిగేతే అమ్మో ఇది తాళికే ఎగతాళి చేసేలా ఉంది దీని తంతని తన్ను తరిమి వేస్తే అసలు ఊరికి చేరుకుని అమ్మ జ్యుసు నాన్న గ్లాసులో ఆలన పాలన చేస్తూ అమ్మ కనుసన్నల్లో అపర మేధావి అనన్య విద్వంసుడు దగ్గర ఆలపనలు నేర్చి అమ్మ సాక్షిగా అరేంగేట్రం మొదలు పెట్టింది. అమ్మ అలన నాన్న లాలనతో అప్పటికే అవురావుమంటున్న అతి పెద్ద లోకం లోకి కాలుపెట్టి అనతి కాలం లోనే రామా నీ గాణమే అపార మధురం నీ కూని రాగాలు వింటుంటే కలవరం పుడుతుందని కుంటివాడితో కాపురం మొదలు పెట్టి అసలు కాపురంలో నిప్పులు పోసింది.అలా మొదలైన కాపురం కాపురంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఇలా పిండాలని పాచిపోయిన లడ్డుల వలె విసిరి పారేసి ఆ గాణాన్ని అనుక్షణం అనుమానిస్తూ ఉండగా అందుకు బడ్డి కొట్టు కీలకం కాగా కూ కూ అమ్మ కలహాలను కప్పి పుచ్చుతూ ఉండగా ఆ కూని రాగం కానరాని లోకాలకు చేరుకుంది.అయ్యో రామా నన్ను ఒంటరిని చేసావా అంటూ పిండ ప్రదానం అవ్వక ముందే పుండు పుట్టిన వాడితో ప్రేమాయణం సాగించడం మొదలు పెట్టగా హైదరాబాద్ శంకరుడు బుల్లెట్ ఫేమ్ ను బరిలోకి దింపి యూ
  • ఊసుపోదు నాకు ఈ బుద్ది పోదంటూ ఉత్తుత్తి పలుకులు పలుకుతూ ఉండగా ఈ ప్రపంచంలో తనకు మించిన స్వరమాంత్రికుడు లేడని తనకు తానే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం పాత్రలాగా హీరో విలన్,హీరోయిన్ భాస్కర్ అవార్డు లతో కామెడీ చేసి నట్లు ఏజు గేజు కూడా లెక్క చేయని రంగురాల్లోడిని రంగంలో కి దింపి రాజుగారి పాలెం రోడ్లన్ని గుంతల మయం అయ్యేలా మామయ్య అంటూ మాములు వేషాలు వేస్తే ముసలోడు పడుచోడి లాగా పరుగులు తీస్తుండగా టిల్లు టిల్లు బలే ఉంది త్రిల్లు అంటూ తిరుగుడు మొదలు పెట్టగా బేబి తో బహుదూరం ప్రయాణం ప్లాన్ చేస్తే బేబి ఐడి కార్డు తో ఎక్కడ ఏ అవరోధం వచ్చిన సాటీ ఖాఖీ తన కట్టుకున్నదని చెబుతూ కాలాన్ని కొనసాగుతున్న తరుణంలో టిల్లుతో తాటి కాయల మాటున ఉండగా ఖాకీల కంట పడితే గుట్టుచప్పుడు కాకుండా కాపాడి అమ్మ జ్యుసు తో అల్లుడయి పొదామని ఆకాశం కు ఎగిరిన ఈ అందగాడు అందమైన సెల్ ఫోన్, ఆయిల్ లేని ఎలక్ట్రానిక్ బైక్ ఇస్తే అక్కడ హ్యాండిచ్చి అక్కడికి పోతే అర్ధ రూపాయి వస్తుందని అవకాశం ఇస్తే వాడికి హ్యాండిచ్చి బాపట్ల బీచ్ లో భూమి పూజ మొదలై కోటప్పకొండ లో కొత్త కాపురానికి శ్రీకారం చుట్టగా అన్ని తానేనని ఉహించుకున్న టిల్లుకు తిక్క పుట్టగా తన కలలు ప్రపంచంలో ఎన్నో కూని రాగాలు తీస్తూ కారులో నే కాపురాలు చేసిన కుర్రాడు ఓ కంట కనిపెడుతూ ఉండగా కొత్త కాదు ప్రయాణం బైట పడింది. అయ్యో ఇదేమిటని కృంగి పోయి కుసించి పోతున్న ఆ కాంత బాధితులంతా ఒకచోటి కి చేరుకుని కథలు చెప్పుకుంటూ ఉంటుంటే ఓ నైస్..యూ..ఉస్ అనే శబ్ద తరంగాలు అందరిని సంబ్రచ్చార్యానికి గురిచేసాయి.ఇవన్నీ ఒక విధమైతే పూటకో కాపురానికి శ్రీకారం చుడుతూ గుట్టు చప్పుడు కాకుండా ఉంటూ సేమ్ టు సేమ్ గా ఉన్న పుండు పుట్టిన వాడి ఇంకో కాపురంలో ఈ కాపురాల కలహాలు కొట్లాట పెడితే ఆ కేసు కోసం ఎన్నో కార్లు ఎక్కిన పలితం లేక పోయింది.చివరికి కారు కాపురం లేని కరుణతో అసలు కథలు బైటికి రాకుండా కొత్త కాపురాల గుట్టు రట్టు కాకుండా ఆత్మ కథలు రాయడం మొదలు పెట్టి తన అల్లరి బ్రతుకు కోసం అందరి బ్రతుకులు అల్లరి చేస్తూ తన అలవాటు పడిన జీవితాన్ని హాయిగా నడుపుతున్న తరుణంలో కొత్త కాంతి ఈ కాంత కళ్లల్లో పడి ఉన్న కాపురం లో వేరు కుంపట్లు పెట్టి అమ్మ జ్యుసు, నాన్న గ్లాసు సహకారంతో కాపురానికి సిద్ధమై సహజీవనం నుంచి ఒరిజినల్ జీవనానికి తాళికట్టు శుభవేల మెడలో …అని కొత్త రాగం మొదలు పెట్టగా పాత రాగాలన్ని ఒక్కటై ఈ పాపాల కు పుల్ స్టాఫ్ పెట్టలని సిద్ధం కాగా అయ్యో ఒక కోటి కొట్టేసారు ..ఇంకా ఉన్న కోట్లు కొట్టేయ్యడానికి ఇలా కానీ మాటలు అంటున్నారని అంటుంటే ఆ కాంతుడు ఆహా ఈ కాంత ఈ లోకంలో ఉండవలసినది కాదు అయ్యేయ్యో ఎంతటి కష్టమొచ్చేనేనని ఎలా ఎలా అని పిల్లలు కానీ పిల్లలు తండ్రి కానీ తండ్రి అయ్యి ఎంతో తపన పడుతున్నట్లు తెలియ వస్తోంది. అయితే ఈ తప్పుడు కాంత కాపురాలు తెలిస్తే ఆ కాంతి ఇక ఈ లోకం లో కనిపించకుండా పోతుందేమోనన్న కలత చెందుతున్నారు కొంతమంది.చివరికి ఈ కాంత ఇంకెంత మంది కాపురాలలో కాంతులు తొలగిస్తుందని కంగారు పడుతూ ఇక వీటిని కట్టడి చేసే వారు లేరా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎవరో ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు రాక పోరా ఎదురుచూస్తూ ఉన్నారు…
  • ఇది అంతులేని కథ…
  • ఇంకా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article