అనంతపురం : అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూ స్నాతకోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్అబ్దుల్ నజీర్ ని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఎంపీ చర్చించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎదురవుతున్న సమస్యలు, సెంట్రల్ యూనివర్సిటీకు సంబంధించిన సమస్యలను గవర్నర్ కి ఎంపి అంబిక వివరించారు. రాష్ట్ర గవర్నర్ కూడా పలు అంశాలపై ఎంపీతో సమగ్రమైన సమాచారం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.