తాడేపల్లిగూడెంలో జనసేన ఎన్నికల ప్రచార గుర్తును విస్తృతంగా ప్రచారం చేసేందుకు గాజు గ్లాస్ లో ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నారు జనసేన నేతలు.
ఇందుకోసం ఉచిత టీస్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వెరైటీ ప్రమోషన్ ద్వారా ఒకటి ప్రజలకు ఉచితంగా టీ అందించడంతో పాటు జనాల్లోకి తమ పార్టీ గుర్తును తీసుకెళ్లినట్లు కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.2019 ఎన్నికలకు ముందు కూడా ఆ పార్టీ నేతలు కాకినాడలో ఇదే కార్యక్రమాన్ని చేపట్టారు.