Wednesday, May 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్గొంతెత్తి మొత్తుకొంటోంది ప్రజాభుమి…

గొంతెత్తి మొత్తుకొంటోంది ప్రజాభుమి…

*పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయని…
*విస్తరిస్తున్న మాఫీయా గాళ్ల రాజ్యం
*సిండికేట్ ల కోసం సిగపట్లు పడుతున్నా…
*కంకిపాడు జోలికి పోతే కర్రలతో దాడులు చేస్తున్నా…
*జయంతి లో మరో పుష్ప-3 సినిమా మించిపోతున్నా..
*లింగాల లో లారీల మోత వినిపిస్తున్నా…
*తిరువూరు నుంచి యథేచ్ఛగా తరలిపోతున్నా ..
*బియ్యం డబ్బుల గోలతో ఓనిండు ప్రాణం బలి కాగా…
*నాడు వైసీపీ నేడు కూటమి నేతల అండదండలు ఉన్నాయంటూ…
*ఒకరి గుట్టును ఒకరు రట్టు చేసుకుంటూ…
*ఏ లారీ ఎటుపోతుందో లొకేషన్ తో సహా షేర్ చేస్తూ…
*లారీలు పట్టించారని తన్నుకు చచ్చినా..
*తిరువూరు డాన్ కు జయంతి పుష్ప డీ అంటే ఢీ అంటుంటే…
*నకిలీ విలేకర్లతో వెకిలి రాతలు రాయిస్తూ…
*రౌడీయిజంకు కూడా వెనుకాడని విదంగా ..
*వాస్తవాలు రాస్తుంటే అవాస్తవాలు కూస్తూ…
*సరుకు నాకే అమ్మలంటూ భయభ్రాంతులకు గురిచేస్తుంటే

  • నిస్తేజం లో నిఘా వ్యవస్థ.ఉంటుంటే…
    *నిజాలు తెలిసినా చేతులకు తడిఅవ్వుతుండటం తో ..ఎం
    *మాఫీయా మామూళ్ల కోసం మానవత్వమే మరిచిపోతుంటే…
    *విజిలెన్స్ అధికారులకు ఇవన్నీ తెలియనివా అంటుంటే…
    *ఎండియు వాహనాలే యథేచ్ఛగా సరుకు పంపిణీలో ఉంటుంటే…
    *రేషన్ ఢీలర్లే రాత్రిపూట అక్రమ రవాణా కు ఆజ్యం పోస్తుంటే…
    *పోలీసులుకు పూర్తి సమాచారం ఉన్నా కూడా…
    *సివిల్ సప్లై అధికారులు చోద్యం చూస్తుంటే..
    *ప్రభుత్వాలు మారినా మారని పేదవాడి బ్రతుకులు …

(రామమోహన్ రెడ్డి)

లచ్చులో లచ్చన్నా…
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
ఎయ్…”అరెరరె లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా ఏయ్…”
అన్నట్లు గా ఉంది ఈ రాష్ట్రంలో ని పేద ప్రజల బ్రతుకులు…పేదవాడి నోటికాడి కూడును దూరం చేస్తున్న రేషన్ మాఫీయా గాళ్లను అరికట్టాల్సిన అధికారులు ఆమ్యామ్యా లకు అలవాటు పడి ఆకలి అన్నవాడికి అన్యాయం చేస్తూ అవినీతి సొమ్ము కోసం అర్రులు చాచుతూ ఉంటే అన్నామో రామచంద్ర అని ఆకలి కేకలు వినిపించక తప్పని పరిస్థితి. రేషన్ మాఫీయా అనేది ఒక మహమ్మారి లాగా మారి మానవత్వం కూడా మరిచి విచక్షణ లేకుండా విచ్చలవిడిగా దోచుకు తింటుంటే దాడులు చేయాల్సిన అధికారులు దారి దోపిడీ గాళ్లకే దండుగా నిలుస్తున్నారనే వదంతులు వస్తున్నా వాటిని లెక్కచేయక సొమ్ము చేసుకుంటున్న అధికార వ్యవస్థ ను చూడాల్సిన దౌర్భాగ్య స్థితిలో పేదవాడు ఉండాల్సి రావడం ఎంతో సిగ్గుచేటే.ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అనుసంధానం గా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫీయా పడగ విప్పి తాండవం చేస్తుంది. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి పేదల కడుపు నింపడం కోసం ఉచితం గా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే ఆ బియ్యాన్ని కొట్టేయ్యడానికి పందికొక్కులవలె మాఫీయా గాళ్ళు ఒక్కొక్క రుగా తెరమీదికి వచ్చి పేదల బియ్యాన్ని తన్నుకు పోతున్నారు.ఇలా పేదల బియ్యాన్ని చౌకగా కొని ఇతర దేశాలకు అధిక రేట్లకు అమ్ముకుని కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులోభాగంగా ప్రాంతాల వారిగా తమ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నా అది సరిపోక ఒకరి ఏరియాలోకి మరొకరి దూరి ఒకరిలో ఒకరు సరిగా లేక తన్నుకు చస్తున్నా సంఘటన చోటుచేసుకుంటూన్నాయి.ముఖ్యంగా తిరువూరు కేంద్రం గా గత ప్రబుత్వం లో ఓమంత్రి అండదండలతో విచ్చలవిడిగా చెలరేగి పోయిన రేషన్ మాఫీయా డాన్ కూటమి ప్రభుత్వం లో కూడా తిరువూరు నుంచే అదే ఆధిపత్యం కొనసాగిస్తూ మెల్లగా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం తానే శాసించాలని కుయుక్తులు పన్నగా అది కాస్త బెడిసి కొట్టి నట్లు తెలియవస్తుంది.అయితే ఈ డాన్ తనకు సరుకు అమ్మిన వారికి సరిగా డబ్బులు ఇవ్వక పోవడంతో ఒక ప్రాంతంలో ముఠా నాయకుడు గా ఉన్న రేషన్ మాఫీయా కు చెందిన ఒక గుండె ఆవేదన తో అలసిపోయి కానరానిలోకాలకు పోగా అప్పులు చెల్లిస్తే కానీ శవాన్ని దహనం చేయనియ్యమనే స్థాయికి వచ్చి నట్లు కూడా సమాచారం అందుతోంది.ఇక గత ప్రభుత్వ హయాంలో నందిగామ వైసీపీ కేడర్ అండదండలతో పుష్ప సినిమా లాగా రేషన్ మాఫీయా ను నడిపిన జయంతి కింగ్ కూటమి ప్రబుత్వం లో కాలం కలిసి రాక తిరువూరు డాన్ రేషన్ లారీలను పట్టించగా తిరిగి జయంతి బియ్యం స్మగ్లర్ లారీలు తిరువూరు డాన్ పట్టించగా ఇరువురు తన్నుకు చచ్చారని వదంతులు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో ఈ మాఫీయా గాళ్ళు బెజవాడలో పాగా వేయడానికి నకిలీ విలేకరులను అడ్డుగా ఉంచుకుని తమ అవినీతి సొమ్మును ఈ నకిలీగాళ్లకు ఇస్తూ వీరి బాగోతం బైట పెట్టె వారిని టార్గెట్ చేసుకుంటూ సిండికేట్ అయ్యేందుకు సర్వప్రయత్నాలు చేస్తున్నా ఆ పాచికలు పారక పోవడం తో ప్రత్యక్ష దాడులకు దిగేందుకు కూడా మాఫీయా గాళ్ళు ముందుకు వస్తున్నారు.మరి ఇన్ని జరుగుతూనే ఉన్నా నిఘా వ్యవస్థ నిద్ర మత్తులో ఉందా… విజిలెన్స్ అనేది ఉందా లేదా సివిల్ సప్లై అధికారులు చూస్తూ ఉన్నారా అన్నది అర్థం కావడం లేదు.కూటమి ప్రభుత్వం వచ్చిందని పేరుకే తప్ప అంతా కొత్త సీసాలో పాత సారాల పాలన ఉందనే అపవాదు మూటకట్టుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం.ఈ రేషన్ మాఫీయా గాళ్లను తుదముట్టించే వారెవరు అన్నది వేచి చూడక తప్పని పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article