Friday, May 2, 2025

Creating liberating content

టాప్ న్యూస్రెచ్చిపోతున్న రేషన్ మాఫీయా గాళ్ళు…

రెచ్చిపోతున్న రేషన్ మాఫీయా గాళ్ళు…

*డాన్ లంటూ సోసియల్ మీడియాలో ప్రచారాలు..
*త్వరలో యువసేన లు కూడా వస్తాయట…
*టైగర్ నాగేశ్వరరావు కంటే గొప్పవారు కాదుగా…
*కసబ్ కంటే కంత్రిగాళ్ళు లాగా ఉంటుంటే ..
*నేడు కోటా బియ్యం గొడౌన్ నుండి డిపోలకు …
*డిపోల నుంచి నేరుగా మాఫీయాగాళ్ల చేతిలోకి …
*ఆద్యంతం చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం..
*విజిలెన్స్ అండ ఉండగా మాకేల అంటున్న మాఫీయా..
*ధర్మాజిగూడెం ,చాట్రాయి లో చేతులు మారుతున్నా ..
*చేస్టలుడిగి చూస్తున్నట్లు గా ఉంటుంటే ..
*నిఘా వ్యవస్థ కు తెలియకుండా ఇదంతా జరిగుతుందా…
*మామూళ్ల కోసం మూటలను ముట్టుకోరా ..
*నాలుగు కేసులుంటే రౌడీ షీట్ తెరిస్తే…
*అన్ని కేసులు నమోదవుతున్న షీట్ లో కాళీ లేదా…
*ప్రభుత్వ సొమ్ము దోచుకు తింటుంటే రాజద్రోహం కాదా ..
*స్మగ్లింగ్ అంటే ఏదయినా ఒకటే అవ్వదా…
*పిడిఎస్ పట్టుబడితే పీడి యాక్ట్ పెట్టలేరా…
*కఠిన చట్టాలు నోట్ల కట్టలకు అడ్డు వస్తున్నాయా…
*కట్టడి చేయలేనప్పుడు కహానిలు దేనికీ…
*పేదవాడికి కూడు దూరం చేస్తున్న కానరాకపోతే…
*కూటమి ప్రభుత్వంలో కూడా పేదోడికీ ఫలితం సూన్యమేనా…
(రామమోహన్ రెడ్డి)
” Ignorance of the law is no excuse”
“చట్టం యొక్క అజ్ఞానం క్షమించరాదు” అనేది చట్టపరమైన సూత్రం. దీని అర్థం, చట్టాన్ని ఉల్లంఘించినా, దాని గురించి తెలియకపోవడం వల్ల క్షమణ పొందలేము. అంటే
చట్టాన్ని పాటించకపోవడం సాకు కాదు.
ఎవరు చట్టాన్ని పాటించడం లేదు…ఏమిటా చట్టం…ఎందుకు చట్టం చుట్టమైనది అంటే చాల రకాం ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బెజవాడ నగరం పెద్దది. ఇలాంటి నగరం లో పందికొక్కులు పడి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదవాడి బియ్యాన్ని మొత్తం తినేసి అవినీతి అన్నదానిని మాత్రమే మిగిల్చివేస్తున్నాయి ఈ పందికొక్కులు మిగిల్చిన అవినీతంతా దావణం లా వ్యాపించి ప్రజల జీవన ప్రమాణాలను దహించి వేస్తోంది.
దీని వల్ల నీతి లేనిది ప్రజాలకా అధికారులకా…లేక ప్రజాస్వామ్య వ్యవస్థ కే నీతి లేకుండా పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే సివిల్ సప్లై శాఖలోని పలు విభాగం అధికారులు వ్యవహరిస్తున్న తీరు అలా ఉంది. ముఖ్యంగా విజయవాడ పరిధిలో రేషన్ బియ్యం విషయంలో అనుసరిస్తున్న విధానాలు అందరిని అచ్చర్య పరుస్తున్నాయి. వార్డుకోక మాఫీయా గాడు అవతార మెత్తి గన్నీ బ్యాగులతో బియ్యాన్ని తరలిస్తుంటే సంబంధిత అధికారుల చేష్టలు ఎలా ఉన్నాయో అర్ధమవుతుంది.
విజిలెన్స్ అధికారులు గొడౌన్ సీజ్ చేసిన తాళాలు పగలగొట్టి రేషన్ బియ్యాన్ని తరలించే స్థాయికి మాఫీయా గాళ్ళు రెచ్చిపోయి పైగా మళ్లీ అదే విజిలెన్స్ సీఐ గన్నీ బ్యాగులతో పట్టుకున్నా చర్యలు నామమాత్రంగా ఉంటే ఈ మాఫీయా గాళ్ల సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పేకళించే వారేవరు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టుబడిన కేటుగాళ్ల కాలర్ ఎగరేసుకుని ప్రభుత్వ యంత్రాంగం పైనే అవాకులు చవాకులు పేలుతుంటే అన్ని తెలిసి కూడా మౌనంగా ఉంటున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి.
అసలు ఈ బియ్యం మాఫీయా గాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు వీరు ఎక్కడికి ఎలా పేదల పొట్టకొట్టి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం నిఘా వర్గాల వద్ద లేదని అనుకుంటే అదిపోరాపాటే అవుతుందని చెప్పాలి.ఒక గుమస్తా స్థాయి నుంచి మాఫీయా గా ఎదిగి మీడియా,విజిలెన్స్ వ్యవస్థలనే కించ పరిచేలా ఆరితేరిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నా ఆ కేటుగాళ్లను కట్టడి చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రబుత్వ యంత్రాంగం ఉందంటే ఏమని ప్రశ్నించాలో ..ఎవరిని నిందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పేద ప్రజల నోటికాడి కూడు దూరం చేస్తూ బియ్యం కట్టలను కొట్టేస్తూ నోట్ల కట్లున్నాయని యువసేన లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న నేపధ్యం చూస్తే గతం తాలూకు స్టువర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు ను మించి పోయారని అనాలా వద్దా అన్న మీమాంసకు పరిస్థితులు దారితీస్తున్నాయి.
ఉగ్రవాదులు కసబ్ ,టైగర్ నాగేశ్వరరావు లనే కట్టడి చేసిన ఈ ఖాకీలకు కోటా బియ్యం కొట్టేస్తున్న ఈ కేటుగాళ్లని నియంత్రణ చేయడం పెద్ద పనికాదేమో అన్నది కూడా వాస్తవమని ఒప్పుకోవాల్సిందే.
సాధారణంగా వివిధ నేరాల్లో ను ,రాజకీయ పరమైన కేసుల్లో రౌడీ షీట్ ఓపెన్ చేసే అధికార వ్యవస్థ ఈ మాఫీయా గాళ్ళు ఇన్ని సార్లు పట్టుబడిన వీరి మీద ఎందుకు షీట్ ఓపెన్ చేసి గట్టి చర్యలు చేపట్టలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడు పస్తులుండకూడదన్న మహోన్నత ఆశయం తో వేల కోట్లు ఖర్చుపెట్టి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే వాటిని పందికొక్కులాగా తన్నుకు పోతుంటే అది రాజద్రోహం కింద రాదా అన్న చర్చ కూడా జరుగుతోంది.
ప్రపంచంలో అత్యంత విలువైన అరుదుగా లభించే ఎర్రచందనం కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి కట్టడి చేయగలిగిన సమర్థవంతమైన వ్యవస్థ కలిగి ఉన్నప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా పట్టణ ప్రాంతాల్లో నే యథేచ్ఛగా ప్రతినెల ఒకటో తేదీ నుండి 20 వతేది వరకు లారీలకు లారీలు తరలిస్తుంటే అడ్డుకట్ట వేసి వారి అంతు చూడలేని నిస్సహాయ స్థితిలో అధికార వ్యవస్థ ఉందని అంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుందని చెప్పాలి.
ప్రభుత్వం లోఉన్న పెద్ద పెద్ద నేతలే ఈ బియ్యం కేటుగాళ్ల వెనుక ఉండి నడిపిస్తూ పేరుకు పేదల బియ్యం అని ముద్ర వేసి పక్కదారిలో పరాయి రాష్ట్రాలకు తరలిస్తూ పెద్ద మొత్తం పొగుచేసుకుని పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అందుకే ధర్నాజి గూడెం,చాట్రాయి లో పట్టుబడిన పటమటలో పట్టుబడిన ,సింగ్ నగర్ లో పట్టుబడిన పీడి యాక్ట్ లాంటి చట్టాన్ని వాడకుండా చూసి చూడనట్లు వదిలివేస్తుండడం తో మాఫీయా గాళ్ళు ఇదంతా మాములే అన్న ధోరణినికి వచ్చేసారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article