Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఅయోధ్యలో ప్ర‌ధాని మోదీ రేప‌టి ప‌ర్య‌ట‌న షెడ్యూల్

అయోధ్యలో ప్ర‌ధాని మోదీ రేప‌టి ప‌ర్య‌ట‌న షెడ్యూల్

న్యూఢిల్లీ:‌అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు.
ప్రాణప్రతిష్ఠ కోసం ప్రధాని 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనుష్ఠాన్ సమయంలో వివిధ ఆచారాలను ప్రధాని ఆచరిస్తున్నారు. ప్రత్యేక ఆచారం జనవరి 12న ప్రారంభమైంది. ఇందుకోసం ప్రధాని నేలపైనే నిద్రిస్తూ.. కేవలం కొబ్బరి నీళ్లనే తీసుకుంటున్నారు.
ప్రధాని మోదీ సోమవారం ఉదయం 10.25 గంటలకు అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌ ద్వారా ఉదయం 10.55 గంటలకు రామయ్య ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.
రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రధాని మోడీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులతో మమేకమయ్యే బహిరంగ కార్యక్రమంలోనే ఉంటారు. ఇక మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దాంతో ప్రధాని షెడ్యూల్ పూర్తవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article