Wednesday, January 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్రెండే నెలలు… రోడ్డు కష్టాలకి మోక్షం

రెండే నెలలు… రోడ్డు కష్టాలకి మోక్షం

• పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు – గొడవర్రు – రొయ్యూరు – రహదారి నిర్మాణం దాదాపు పూర్తి
రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సుమారు 21 వేల మంది ప్రజలకు సాంత్వన

పెనమలూరు నియోజకవర్గం- కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు రోడ్డు. రెండు నెలల క్రితం నడిచేందుకు కూడా అనువుగా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు సాఫీగా ప్రయాణం చేసేలా నిర్మాణం అవుతోంది. పాలకుడు మాటిస్తే కలలో కూడా మర్చిపోకూడదు అంటారు. గత రెండు నెల క్రితం కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్బంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి- అదే వేదికపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గొడవర్రు – రొయ్యూరు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నివేదించారు. ప్రజలు కనీసం ఆ రోడ్డు నుంచి నడవలేకపోతున్నారనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దానిపై అప్పట్లోనే సభా వేదిక నుంచి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దానికోసం వెంటనే నిధుల సమీకరణ చేసి ఐదు కిలోమీటర్ల రోడ్డుకు మోక్షం కలిగించారు. కంకిపాడు, రొయ్యూరు, గొడవర్రు పంచాయతీల్లో ఉన్న 21 వేల మంది ప్రజలకు ఈ రోడ్డు ద్వారా ప్రయోజనం కలగనుంది. కేవలం రెండే నెలల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణం పూర్తి కావొచ్చింది. రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం సోమవారం పవన్ కళ్యాణ్ గొడవర్రు గ్రామంలో పర్యటించారు.పనుల తీరును పరిశీలించిన పవన్ కళ్యాణ్ గారుకంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు వరకు మొత్తం ఐదు కిలోమీటర్ల రోడ్డును జాతీయ ఉపాధి హామీ పథకం, ఎస్డిఆర్ఎఫ్ నిధులతో నిర్మించారు. 3.63 కిలోమీటర్ల మేర గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో, మిగిలిన రోడ్డు ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులతో పూర్తి చేశారు. దీనికోసం మొత్తంగా రూ. 3 కోట్ల ఖర్చు అయింది. గొడవర్రు వరకు సీసీ రోడ్డు తర్వాత బీటీ రోడ్డును వేశారు. చివరి దశ పనులు సాగుతున్నాయి. ఈ పనులు సంక్రాంతి నాటికల్లా పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. పనులు జరుగుతున్న తీరును, రోడ్డు ఎంతమందికి ప్రయోజనం? ఏ ప్రాతిపదికన వేస్తున్నారన్నది అధికారులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. గతంలో ఉన్న రోడ్డు పరిస్థితిని చిత్రాల ద్వారా అధికారులు ఉప ముఖ్యమంత్రికి చూపించారు. మూడు లేయర్లుగా రోడ్డును వేస్తున్నామని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని అధికారులు తెలియజేశారు. రోడ్డును కేవలం ఉన్నది ఉన్నట్లు వేయవద్దని, పూర్తిగా రోడ్డును తొలిచి తర్వాత రోలర్ ద్వారా చదును చేయించిన అనంతరం లేయర్లు వచ్చేలా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అప్పుడు మాత్రమే చాలా కాలంపాటు రోడ్డు నిలుస్తుందని, దీన్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. కొన్నేళ్లుగా ఈ రోడ్డు అత్యంత దారుణంగా ఉందని, కనీసం రోడ్డు మీదుగా నడవలేని పరిస్థితి ఉందని రొయ్యూరు గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ కి చెప్పారు. హాస్పిటల్స్ కు గర్భిణీలను తీసుకువెళ్తే ఈ రోడ్డులోనే ఆ గుంతల కుదుపులకు డెలివరీ అయ్యే పరిస్థితిలు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ సాగు వస్తువులు, ఉత్పత్తులను తీసుకువెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉండేదని, గత పాలకులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదని చెప్పారు. అడిగిన వెంటనే రోడ్డును మంజూరు చేయడమే కాక దగ్గరుండి పనులు చేయించి పరిశీలించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మూడు గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టి, కృతజ్ఞతలు తెలియజేశారు.స్వయంగా నాణ్యత పరిశీలనపల్లె పండుగ కార్యక్రమం ద్వారా కంకిపాడు, గొడవర్రు, రొయ్యూరు రోడ్డును వేస్తున్న తీరును అడిగి తెలుసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అధికారులు చెప్పిన లేయర్లకు తగ్గట్లుగా రోడ్డు వేస్తున్నారా లేదా? అన్నది రోడ్డును తవ్వించి మరీ పరిశీలించారు. కూలీలను పిలిచి సుమారుగా అర మీటరు లోతు వరకు తవ్వించి లేయర్లు మొత్తం పరిశీలించారు. గ్రావెల్ తోపాటు తారు సమపాళ్లలో ఉన్నాయా అన్నది చూసి తెలుసుకున్నారు. పనుల్లో ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకొని ఏమైనా నాణ్యత విషయంలో తేడాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తన దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా ఖజానా నుంచి ఖర్చుపెట్టే ప్రతి రూపాయి ప్రజలకు పది కాలాలపాటు ఉపయోగపడేలా ఉండాలి అన్నదే తమ అభిమతమని చెప్పారు. కేవలం అధికారుల నివేదికలు చూసి వెళ్లిపోకుండా, స్వయంగా ఉపముఖ్యమంత్రి రంగంలోకి దిగి రోడ్డు నాణ్యతను పరిశీలించడం అందరిలో సంతోషాన్ని కలిగించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి పరిశీలన చేయడంతో మూడు గ్రామాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర , పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ , పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా , పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ , కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article