ద్వారకాతిరుమల
విజయవాడలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యూ జె )నేతలు ద్వారకాతిరుమల ను సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ చైర్మన్ శ్రీ ఎస్ వి సుధాకర్ సూచనల మేరకు ఆలయ అధికారులు ఎన్ యూ జే నేతలకు స్వాగతం పలికి దైవ దర్శనం చేయించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఆలయ అర్చక స్వాములు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వరుని చరిత్ర, వైభవాన్ని 20 రాష్ట్రాల నుంచి వచ్చిన పాత్రికేయ సంఘాల నేతలకు వివరించారు. ఆలయ ప్రసాదాలను అందజేశారు. ఎన్ యు జే జాతీయ అధ్యక్షుడు రాస్ బిహారి, ఉపాధ్యక్షులు శివకుమార్, రాణా, జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం డి వి ఎస్ ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్ రెడ్డి, జాప్ ట్రస్ట్ చైర్మన్ పి సుభాష్ బాబు, సీనియర్ నేత డి వెంకా రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు.