Wednesday, January 8, 2025

Creating liberating content

సినిమా"అల్లు"డి కోసం రంగంలోకి మెగా బ్రదర్స్

“అల్లు”డి కోసం రంగంలోకి మెగా బ్రదర్స్

సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారుతోంది. అల్లు అర్జున్ కు మద్దతుగా మెగా బ్రదర్స్ రంగంలోకి దిగారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను ప్రవేశ పెట్టారు. దీంతో, కోర్టు న్యాయపరంగా మెగా బ్రదర్స్ సంప్రదింపులు చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ ఫోన్ లో అల్లు అరవింద్ తో మాట్లాడినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతోందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.సంధ్యా థియేటర్ వద్ద పుష్ఫ -2 ప్రీమియర్ షో ప్రదర్శించిన వేళ అల్లు అర్జున్ సినిమా హాల్ వద్దకు ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా మారింది. దీని పైన పోలీసులు కేసులు నమోదు చేసారు. అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఢిల్లీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల తరువాత నాంపల్లి కోర్టుకు తరలించారు. అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ కోర్టుకు వెళ్తున్నారు. అటు న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు.ఇక, అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెలిసిన తరువాత చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ మధ్యలో నిలిపివేసి తన సతీమణితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అదే విధంగా నాగబాబు సైతం వారితో కలిసారు. అల్లు అర్జున్ పై నమోదైన కేసులు..న్యాయ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన చర్చలు చేస్తున్నారు. అటు హైకోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వేసిన పిటీషన్ ఈ సాయంత్రం విచారణకు రానుంది. ఇప్పుడ నాంపల్లి కోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. రిమాండ్ కు పంపిస్తారా .. హైకోర్టులో విచారణ జరిగే వరకూ వేచి చూస్తారా అనేది తేలాల్సి ఉంది. రేపటి నుంచి వరుసగా రెండు రోజులు సెలవులు కావటంతో అల్లు అరవింద్, మెగా బ్రదర్స్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే.. బెయిల్ పొందటం పైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తో ఆయన కుటుంబ సభ్యులకు మెగా బ్రదర్స్ ధైర్యం చెబుతున్నారు. ఇక, ఇప్పుడు అల్లు అర్జున్ రిమాండ్ ..బెయిల్.. కోర్టు ఏం చెబుతుందనేది మరి కాసపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article