తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తీవ్ర సంచలనంగా మారింది. పుష్ప 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ లో పెద్ద హంగామా చేస్తున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో అరెస్ట్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన హైదరాబాద్ సీపీ ఈరోజు ఊహించని విధంగా పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ని విచారించి స్టేషన్ బెయిల్ పైన బయటకు పంపిస్తారా లేదా అన్న ఉత్కంఠ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తాజాగా దీనిపైన స్పందించారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగిందని, ఆయన పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణం కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం ఈ కేసులో అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఆయనను కోర్టుకు హాజరు పరచనున్నారు. అల్లు అర్జున్ కు కోర్టు రిమాండ్ విధిస్తుందా? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసామని పేర్కొన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ కేసులో అల్లు అర్జున్ పై 105 118 (1) రెడ్ విత్ 3/5 బి ఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టుకు తరలించడానికి అంత సిద్ధం చేస్తున్నారు. దీంతో కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తుందా అన్నది ప్రస్తుతం ఉత్కంఠను రేకర్తిస్తుంది. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లు చెప్తుంది ఇదే అయితే అల్లు అర్జున్ పైన పెట్టిన నాలుగు సెక్షన్ల విషయానికొస్తే 105 సెక్షన్ నాన్బెయిలబుల్ కేసు. ఇందులో ఆయనకు ఐదు నుంచి పది ఏళ్ళ పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బి.ఎన్.ఎస్ 118 (1) కింద ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు చట్టం చెబుతోంది. దీంతో అల్లు అర్జున్ కేసులో ఏం జరగబోతుంది అన్నది రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.