నాగ చైతన్య , శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.యూనిక్ ఔట్ ఫిట్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా అందంగా కనిపించి ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేసింది.శోభిత తన డ్రెస్సులో ఎక్కడా కూడా అశ్లీలత లేకుండా జాగ్రత్త పడినట్టు కనిపించింది. పద్దతిగా కనిపిస్తూనే తనదైనశైలిలో కనిపిస్తూ అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. శోభిత ధూళిపాళ సినిమాల్లో యమ హాట్‌గా కనిపిస్తుంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకు శోభిత దూరంగా ఉంటారని తెలుస్తోంది.