Monday, January 20, 2025

Creating liberating content

సినిమాఓటీటీలోకి వచ్చిన విక్రమ్ 'తంగలాన్'…

ఓటీటీలోకి వచ్చిన విక్రమ్ ‘తంగలాన్’…

చియాన్ విక్రమ్ హీరోగా నటించి ‘తంగలాన్’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 19వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. బ్రిటీషర్ల పాలనలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల పై అణిచివేత, వారి జీవితాల్ని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు పా రంజిత్. తమిళ సినిమాల్లో సామాజిక అంశాలను టచ్ చేసే దర్శకుడిగా పా రంజిత్ కు ఓ ఇమేజ్ ఉంది. తంగలాన్ కథలోకి వెళితే… కోలారు బంగారు గనులను తవ్వి తీయడానికి బ్రిటీషు అధికారులు ఓ గిరిజిన తెగను వినియోగించుకుంటారు. కానీ ఆ బంగారం వెలికి తీయడానికి ‘ఆర్తి’ అనే శక్తి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. మరి చివరకు బంగారం ఎవరికి దక్కిందనేదే అసలైన కథ. ఇందులో గిరిజన నాయకుడిగా విక్రమ్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ‘శివపుత్రుడు’, ‘ఐ’ సినిమాల తర్వాత విక్రమ్ కు పెద్ద సవాల్ గా నిలిచిన పాత్ర ఇది. ఈ సినిమా వల్ల గాయాల పాలయ్యారు కూడా. పార్వతి, మాళవికా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడు. 19 శతాబ్దపు కథకు నాటి వాతావరణాన్ని తీసుకురావడంలో పా రంజిత్ సక్సెస్ అయ్యారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఆగస్టులో విడుదలైంది.వివాదం తెచ్చిన చిక్కుసాధారణంగా, ఈ సినిమా ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే, పా రంజిత్ సినిమాలంటే వివాదాల్నీ మోసుకొస్తాయి. మొదటి నుంచీ అంబేడ్కర్ భావజాలం స్ఫూర్తి తో సినిమాలు తీస్తూ ఉంటారు పా రంజిత్. రజినీకాంత్ ‘కబాలి’, ‘కాలా’, కార్తీ ‘మద్రాస్’ సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అందుకే ఆయన సినిమాలు యునానిమస్ గా హిట్ అయిన సందర్భాలు తక్కువ. విక్రమ్ ‘తంగలాన్’ ఆశించినంత ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా ఆయన వివాదాలను పట్టించుకోకుండా తన స్టయిల్లో సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే, విక్రమ్ తంగలాన్ ఓటీటీ రిలీజ్ కు ఆయన తీసిన కంటెంట్ అడ్డంకి గా మారింది. ఈ సినిమాలో హిందూ మతాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయని మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఓ రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగుందని పిటీషనర్ పేర్కొన్నారు. సెన్సార్ సెర్టిఫికేషన్ పూర్తి అయ్యాక, థియేటర్లలో విడుదలైన సినిమాను ఓటీటీలో రిలీజ్ కాకుండా ఆపడం సమంజసం కాదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగుమం అయింది. డిసెంబరు 10వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో సైలెంట్ గా విడుదలైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article