Friday, January 17, 2025

Creating liberating content

హెల్త్బ్రెలిజ్ నట్స్‌ తింటే థైరాయిడ్ సమస్యలు చెక్‌

బ్రెలిజ్ నట్స్‌ తింటే థైరాయిడ్ సమస్యలు చెక్‌

బ్రెలిజ్ నట్స్‌లో ప్రోటిన్స్‌, ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌, విటమిన్‌ ఇ ఇతర ఆరోగ్యకరమైన పోషకాలు నిండుగా లభిస్తాయి. వీటిని ఎక్కువగా థైరాయిడ్‌ వాధిగ్రస్తులకు సూచిస్తారు. ఈ బ్రెజిల్‌ నట్స్ తీసుకోవడం వల్ల శరీర నొప్పులు, కొవ్వు, జీర్ణ సమస్యలు, కండరాల సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జుట్టు సమస్యలను కూడా తగ్గుతాయి. అధిక బరువు సమస్యలతో బాధపడేవారికి బ్రెజిల్‌ నట్స్‌ ఒక అద్భుతమైన ఆహారమని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్రెజిల్‌ నట్స్‌ పురుషులు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. సాధారణంగా థైరాయిడ్‌ అనేది చెడు ఆహారం తీసుకోవడం వల్ల లేదా శరీరంలో పోషకలు తగ్గడం వల్ల ఈ సమస్య కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య పురుషుల కంటే అధికంగా స్త్రీలలో కనిపిస్తుంది. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్లాండ్ పనితీరు దెబ్బతినడం వల్ల హార్మోన్ల అసమత్యుల్యత కలుగుతుంది. దీని వల్ల అధిక బరువు, నీరసం, అలసట, చికాకు, ప్రిరియడ్స్‌ సరిగ్గా రాకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి బ్రెజిల్‌ నట్స్‌ ఎంతో మేలు చేస్తాయి. ఈ నట్స్‌లోని సెలీనియం థైరాయిడ్‌ గ్లాండ్‌ సక్రమంగా పనిచేసేలా సహయపడుతుంది. థైరాయిడ్ హార్మోన్‌ టీ-౩ ఉత్పత్తికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది. సెలీనియం లోపం వల్ల హైపోథైరాయిడ్‌, థైరాయిడిటిస్‌ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. బ్రెజిల్ నట్స్‌ను ఇతర గింజలు, ఎండిన పండ్లు లేదా ట్రైల్ మిక్స్‌తో కలిపి తీసుకోవచ్చు. ఇది ఒక సంతృప్తికరమైన స్నాక్‌గా తినవచ్చు. బ్రెజిల్ నట్స్‌ను సలాడ్‌లకు జోడించడానికి చేర్చవచ్చు. వాటిని ఆకుకూరల సలాడ్‌లు, చికెన్ లేదా చేపల సలాడ్‌లు లేదా పండ్ల సలాడ్‌లలో ఉపయోగించవచ్చు.బ్రెజిల్ నట్స్‌ను బ్రెడ్, మఫిన్‌లు, కుకీలు, బ్రౌనీల వంటి బేక్డ్ వస్తువులకు క్రంచ్ పదార్థాలతో ఉపయోగించవచ్చు. రుచిని జోడించడానికి ఉపయోగించవచ్చు. బ్రెజిల్ నట్స్ ప్రోటీన్ కు మంచి మూలం. ఇది వాటిని శాకాహారి లేదా శాకాహారి ఆహారానికి గొప్ప చేర్పుగా చేస్తుంది. వాటిని సూప్‌లు, స్టూలు, చిక్కుళ్ళలో ఉపయోగించవచ్చు లేదా బర్గర్‌లు లేదా మీట్‌బాల్‌ల కోసం మాంసం ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article