అనంతపురము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఆయనను అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ రాజధాని ఢిల్లీ నందు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ వివిధ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ఢిల్లీ మాన్సింగ్ రోడ్‌లోని తాజ్ మహల్ హోటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆతిథ్యం ఇస్తున్న కార్యక్రమానికి సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఎంపీ పాల్గొన్నారు.తదనంతరం అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారం కోసం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎంపీ అంబిక లక్ష్మణ నారాయణ వినతి పత్రం అందజేసారు. అనంతపురం జిల్లాలో తమ దృష్టికి వచ్చినటువంటి శాఖల వారీగా తెలియజేశారు. గ్రామీణ అభివృద్ధి శాఖలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరిన్ని నిధులను కేటాయించాలని, పథకo మరింత అభివృద్ధి చేయవలసిందిగా తెలుపుతూ, కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కుటుంబాలకి అదనపు పనిదినాలు కల్పించాలని కోరారు. అలాగే, పని చేయుచోట కూలీలకు వసతులు నీరు, నీడ(షెడ్స్), మెడికల్ కిట్స్ కల్పించాలని, కూలీలకు పనిముట్లు కల్పించాలని కోరారు. కోవిడ్ టైంలో గ్రామీణ అభివృద్ధి శాఖలో గ్రామాలలో అనేకమంది కూలీలకు ఎక్కువ స్థాయిలో పని కల్పించి నారు అని, పనిచేసినటువంటి ఉద్యోగులకు ఆరు సంవత్సరాల నుండి ఒక్కరూపాయి కూడా వేతనం పెంచలేదని, ఉద్యోగుల గ్రేడింగ్ సమస్యలు, పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. గతంలో గ్రామీణ శాఖ మంత్రిగా నారా లోకేష్ మాత్రమే జీతాలు పెంచారని గుర్తు చేశారు.
గ్రామ పంచాయతీనందు జిల్లా ప్రజా పరిషత్ ద్వారా 15 ఫైనాన్స్ కమిషన్ నిధులను పెంచి గ్రామస్థాయిలో మరిన్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా, సానిటేషన్ విభాగాల ద్వారా గ్రామీణ స్థాయిలోను, పట్టణాల్లోనూ జలజీవన్ మిషన్ మరింత నిధులు కల్పించి ప్రతి ఇంటికి మంచి నీటిని అందించాలని కోరారు. జిల్లా పంచాయతీ విభాగం ద్వారా శానిటేషన్ వర్కర్స్ వేతనాలను సరైన సమయంలో ఇచ్చి, వేతనాలు పెంచవలసిందిగా మంత్రి కోరారు.