సినిమా'డాకు మహారాజ్' USA ఈవెంట్ కి వెన్యూ ఖరారు

‘డాకు మహారాజ్’ USA ఈవెంట్ కి వెన్యూ ఖరారు

బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ కి “డాకు మాహారాజ్” అనే టైటిల్‌ ని లాక్ చేసారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టైటిల్ టీజర్ ఆయన అభిమానులను, సినీ ప్రియులను ఉర్రూతలూగించింది. ఇప్పటికే ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌గా ఉంటుందని బాలకృష్ణ తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా యొక్క USA డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని శ్లోక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం జనవరి 4న సాయంత్రం 8 గంటల నుండి డల్లాస్, టెక్సాస్ లో గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article