Thursday, May 1, 2025

Creating liberating content

సినిమాతారక రామారావుకు ఎన్‌టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ విషెస్‌

తారక రామారావుకు ఎన్‌టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ విషెస్‌

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం అవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు నందమూరి తారక రామారావును దర్శకుడు వైవీఎస్‌ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. న్యూ టాలెంట్‌ రోల్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా తారక రామారావును వైవీఎస్‌ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బెస్ట్‌ విషెస్‌ చెబుతూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ”చిత్ర పరిశ్రమలో మొదటి అడుగులు వేస్తున్న నీకు ఆల్‌ ది బెస్ట్‌ రామ్‌. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. మీకు విజయం తప్ప మరేమీ కాదు! మీ ముత్తాత ఎన్టీఆర్‌, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల ప్రేమ, ఆశీస్సులతో నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. షైన్‌ ఆన్‌ మై బారు” అని శుభాకాంక్షలు తెలియజేశారు.నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ” నా ప్రియమైన రామ్‌కి శుభాకాంక్షలు, నువ్వు మీ తొలి సినిమాతో మా అందరినీ గర్వపడేలా చేస్తారని మరియు నీ సినీ కెరీర్‌లో చాలా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను, నీకు తాత తారక రామారావు, నా అన్న జానకి రామ్‌ అశీసులు ఎల్లప్పుడు ఉంటాయి. ఆల్‌ ది బెస్ట్‌ రామ్‌” అని ట్వీట్‌ చేస్తూ యంగ్‌ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article