సాహిత్యంఇంట్లో సాంబ్రాణి వేస్తే.. సమస్యలు దూరం..?

ఇంట్లో సాంబ్రాణి వేస్తే.. సమస్యలు దూరం..?

సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో వేయడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సాంబ్రాణి ధూపంతో చాలా లాభాలు పొందవచ్చు. ఆదివారం రోజున ఇంట్లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయడం వలన ఆత్మబలం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది. ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని ఆదివారం వేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సిరిసంపదలను పొందవచ్చు. సోమవారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కూడా సమస్యల నుంచి బయటపడొచ్చు. మంగళవారం నాడు సాంబ్రాణి పొగ వేయడం వలన శత్రుభయం, ఈర్ష్య, అసూయ వంటి వాటి నుంచి బయటపడొచ్చు.అప్పులతో బాధపడే వాళ్ళు గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం వలన అప్పులు తీరుతాయి. బుధవారం నాడు సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయడం వలన నమ్మకద్రోహం ఉండదు. గురువారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. గురువారం రోజున పూజ గదిలో సాంబ్రాణి పొగ వేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు.లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. శుక్రవారం రోజున ఇలా చేయడం వలన విజయాన్ని కూడా సాధించవచ్చు. శనివారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం వలన బద్ధకం తొలగిపోతుంది. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండే వాళ్ళు శనివారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం మంచిది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article